Share News

Kumaram Bheem Asifabad: సేంద్రియ ఎరువులే వాడాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:06 PM

సిర్పూర్‌(టి), జూన్‌ 11: రసాయనఎరువులకు బదులు సేంద్రి య ఎరువులనే వాడాలని కాగజ్‌నగర్‌ డివిజనల్‌ వ్యవసాయాధికారి మనోహర్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:  సేంద్రియ ఎరువులే వాడాలి

- కాగజ్‌నగర్‌ డివిజన్‌ వ్యవసాయాధికారి మనోహర్‌

సిర్పూర్‌(టి), జూన్‌ 11: రసాయనఎరువులకు బదులు సేంద్రి య ఎరువులనే వాడాలని కాగజ్‌నగర్‌ డివిజనల్‌ వ్యవసాయాధికారి మనోహర్‌ అన్నారు. మంగ ళవారం మండలంలోని రైతువేదికలో రైతులకు ఆన్‌లైన్‌ద్వారా పత్తివిత్తనాలు నాటే కొత్త పద్ధతులపై శాస్త్రవే త్తలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని, రసాయన ఎరువులతో పంటతోపాటు భూసారం దెబ్బ తింటుందన్నారు. కంపెనీకి చెందిన బ్రాండెడ్‌ పత్తివిత్త నాలనే నాటాలన్నారు. అలాగే రైతులు అంతరపంటల సాగుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏవోలు మధులత, రామకృష్ణ, డివిజన్‌లోని అన్ని మండలాల ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 10:06 PM