Share News

Kumaram Bheem Asifabad: జిల్లా అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలి

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:57 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 15: జిల్లా అభి వృద్ధికి అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  జిల్లా అభివృద్ధికి అధికారులు సమష్టిగా కృషి చేయాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 15: జిల్లా అభి వృద్ధికి అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా అటవీఅధికారి నీరజ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వశాఖల జిల్లాఅధికారులతో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధిపనులు, సంక్షేమ పథకాలఅమలుపై సమీక్షాసమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాను అన్నిరంగాల్లో ముందు ఉంచే లా అధికారులు సమష్టిగాకృషి చేయాలన్నారు. జిల్లాఅభివృద్ధి, ప్రజలసంక్షేమం దిశగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వర్షాకాలం సీజనల్‌ వ్యాధు లు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యసిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. వనమహోత్సవం కింద జిల్లాలోని అన్ని శాఖలకు 53లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈనెల 31వ తేదీవరకు లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. మహిళాశక్తి పథకం ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. అమ్మఆదర్శ పాఠశా లల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధకారులు పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయపరంగా రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందు బాటులో ఉంచాలన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అందరం సమష్టిగా ప్లాస్టిక్‌రహిత సమాజాన్ని నిర్మిద్దా మని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సిర్పూర్‌ పేపర్‌మిల్లు లిమిటెడ్‌ ఆధ్వ ర్యంలో కళాకారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, ఆర్డీవో సురేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నిసేధితప్లాస్టిక్‌వాడకాన్ని అందరూ సమష్టిగా నిరోధించాలన్నారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల భావిత రాలకు జరిగేనష్టాన్ని ప్రజలకు అవగాహన కార్యక్ర మాల ద్వారా వివరించి చైతన్యం చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛతపై అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ప్రతినిఽధులు రీనాజార్జ్‌,అశోక్‌,కళాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:57 PM