Kumaram Bheem Asifabad: నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:22 PM
ఆసిఫాబాద్, డిసెం బరు 29(ఆంద్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాం త వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు.

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
ఆసిఫాబాద్, డిసెం బరు 29(ఆంద్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాం త వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ డిసెం బరు31న జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా పోలీసుశాఖ ముందస్తుచర్యలు చేపడుతుం దని తెలిపారు. జిల్లా పరిధిలోని పోలీసులతోపాటు ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, షీటీం, పెట్రోలింగ్ విభాగాలకుచెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రో లింగ్ నిర్వహిస్తారన్నారు. అర్ధరాత్రి1గంటలోపు వేడుకలు ముగించాల న్నారు. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తా మన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించినా, ఉల్లం ఘించినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.