Share News

Kumaram Bheem Asifabad: అమ్మ మాట.. అంగన్‌వాడీ బాటను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 15: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, పాఠశా లల్లో చేరేనాటికి అక్షరాలు, అంకెలు నేర్పి ఆటపాట లతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిందని జిల్లా శిశుసంక్షేమ శాఖాధికారి భాస్కర్‌ తెలిపారు.

 Kumaram Bheem Asifabad:   అమ్మ మాట.. అంగన్‌వాడీ బాటను విజయవంతం చేయాలి

-శిశు సంక్షేమాధికారి భాస్కర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 15: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని, పాఠశా లల్లో చేరేనాటికి అక్షరాలు, అంకెలు నేర్పి ఆటపాట లతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిందని జిల్లా శిశుసంక్షేమ శాఖాధికారి భాస్కర్‌ తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కస్సాబ్‌వాడీ, బజార్‌వాడి నెం.1కేంద్రాల్లో నిర్వహించిన అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని సీడీపీవో సాదియారుక్సానా, సూపర్‌వైజర్‌ సుజాత, సిబ్బం దితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలను బలోపే తం చేసేందుకు కేంద్రాలకు రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను చేర్పించేందుకు సోమవారం నుంచి ఈనెల20వరకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్ర మాన్ని ప్రతిఅంగన్‌వాడీ సెంటర్‌లో నిర్వహిం చాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం కూడా అందించనున్నట్లు పేర్కొ న్నారు. జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పంచదార లక్ష్మి, మంజూల తదితరులు పాల్గొన్నారు.

ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ

వాంకిడి: ప్రభుత్వం ప్రారంభించిన అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఐసీడీఎస్‌ ఆధ్వ ర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో రిబ్కా మాట్లాడుతూ అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహక రించాలన్నారు. ఈనెల20వ తేదీవరకు గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి రెండున్నరేళ్ల నుంచి ఐదేళ్లపిల్లల వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు ఆకర్షి తులయ్యేలా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పిల్లలు పాల్గొన్నారు.

దహెగాం(పెంచికలపేట): మండలంలోని సంజీవ్‌నగర్‌లో సోమవారం అంగన్‌వాడీ కేంద్రా ల్లో అమ్మమాట- అంగన్‌వాడీబాట కార్యక్రమాన్ని సూపర్‌వైజర్‌ హసీనా ప్రారంభించారు. కార్యక్ర మంలో సీడీపీవో సురేఖ, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:49 PM