Kumaram Bheem Asifabad: తల్లీ, ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 01 , 2024 | 11:29 PM
కాగజ్‌నగర్, జూలై 1: తాగుడుకు బానిసైన భర్త.. నిత్యం వేధింస్తుండటంతో భరించలేక ముగ్గురు కూతుళ్లతో సహా ఓతల్లి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
- ఇద్దరి పరిస్థితి విషమం
కాగజ్‌నగర్, జూలై 1: తాగుడుకు బానిసైన భర్త.. నిత్యం వేధింస్తుండటంతో భరించలేక ముగ్గురు కూతుళ్లతో సహా ఓతల్లి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కుమరంభీం ఆసిఫా బాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గజ్జిగూడలో చిలుకూరి ప్రతాప్, భార్య అనిత, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రతాప్ ప్రతిరోజు తాగి భార్యతో గొడవపడుతుండే వాడు. సోమవారం ఉదయం కూడా గొడవజరగటంతో జీవితంపై విరక్తి చెందిన అనిత(55), సాయంత్రం కూతుళ్లు లక్ష్మి(21), రమ్య(16), ఐశ్వర్య (14)ను తీసుకొని పొలానికి కెళ్లింది. అక్కడపొలంలో ఉన్న పురుగుల మందు ను ముగ్గురు తాగారు. ఇంతలో అపస్మారకస్థితిలో పడిఉన్న వారి అక్కడ పనిచేస్తున్న కూలీలు గమనించి హుటాహుటిన కాగజ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నలుగురికి వైద్యచికిత్సలు అందించారు. కాగా, లక్ష్మి, రమ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ విషయమై సీఐ అల్లం రాంబాబును వివరణ కోరగా గజ్జిగూడకు చెందిన ప్రతాప్ భార్యతో తరుచూ గొడవపడుతుండే వాడని, తీవ్రమనోవ్యధకు గురైన భార్య అనిత, కూతుళ్లతో సహా ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్టు వివరించారు. ప్రసాద్‌పై గతంలో కూడా కేసులున్నట్టు వివరించారు. ఇటీవలపై బెయిల్‌పై వచ్చినట్టు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి ప్రతాప్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.