Share News

Kumaram Bheem Asifabad: లోక్‌ అదాలత్‌లో ఎక్కువసంఖ్యలో కేసులు పరిష్కరించేలా చూడాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 10:14 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 24: వచ్చేనెల28న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేట్లు చూడాలని జిల్లా సెషన్స్‌ జడ్జి ఎంవీ రమేష్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:  లోక్‌ అదాలత్‌లో ఎక్కువసంఖ్యలో కేసులు పరిష్కరించేలా చూడాలి

- జిల్లా సెషన్‌ జడ్జి ఎంవీ రమేష్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఆగస్టు 24: వచ్చేనెల28న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేట్లు చూడాలని జిల్లా సెషన్స్‌ జడ్జి ఎంవీ రమేష్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా లీగల్‌సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పోలీసుఅధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు, పోలీసులు, అధికారులు కక్షిదారులకు అవగాహన కల్పించడంతోపాటు సమ యం, డబ్బులు ఆదాచేసుకోవాలని, రాజీమార్గమే రాజమార్గమని అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌క్రైంకేసులు, సివిల్‌కేసులనుకూడా రాజీ కుదుర్చుకోవచ్చ న్నారు. పోలీసుస్టేషన్‌ వారీగా, కోర్టువారీగా వివరాలు తెలుసుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు, కోర్టుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న వారు తప్పని పరిస్థితుల్లో వర్టీకల్‌ మోడ్‌లో కూడా కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌జడ్జి యువరాజ, బార్‌అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి రాజీవ్‌రెడ్డి,డీఎస్పీసదయ్య, న్యాయవాదులు పి సురేష్‌, ఎం సురేష్‌, అమ్రిత్‌పాల్‌ కౌర్‌, నరహరి, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మకుమారీలు పాల్గొని రక్షాబందన్‌ ప్రాధాన్యతను వివరిస్తూ న్యాయాధి కారులకు, న్యాయవాదులకు, పోలీసులకు రాఖీలు కట్టారు.

Updated Date - Aug 24 , 2024 | 10:14 PM