Share News

Kumaram Bheem Asifabad: అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:30 PM

ఆసిఫాబాద్‌, జనవరి 18: జిల్లాలో పనిచేయడం ఇష్టం లేకుంటే అధికారులు వెళ్లిపోవచ్చని అంతేకాని అభివృద్ధికి అడ్డుగామారితే ఊర్కొనేది లేదని జిల్లా ప్రజా ప్రతినిధులు స్టాండింగ్‌ కమిటీలో అధికారులను హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ హాల్‌లో చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, సీఈవో రత్నమాల అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Kumaram Bheem Asifabad:  అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం

- జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశం

ఆసిఫాబాద్‌, జనవరి 18: జిల్లాలో పనిచేయడం ఇష్టం లేకుంటే అధికారులు వెళ్లిపోవచ్చని అంతేకాని అభివృద్ధికి అడ్డుగామారితే ఊర్కొనేది లేదని జిల్లా ప్రజా ప్రతినిధులు స్టాండింగ్‌ కమిటీలో అధికారులను హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ హాల్‌లో చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, సీఈవో రత్నమాల అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబుతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధశాఖల అభివృద్ధి నివేదికలను ప్రవేశపెట్టగా అధికారుల ప్రవర్తన తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులకు ఫోన్‌చేస్తే కనీసం స్పందించడం లేదన్నారు. అటువంటి వారు ఇక్కడ పనిచేయాల్సిన అవసరంలేదని జిల్లా అటవీశాఖ అధికారిణి ఉద్దేశించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లాలో రహదారుల నిర్మాణానికి అటవీ అనుమ తులు ఇవ్వక అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో తెలంగాణతో సంబంధం ఉన్నచోట రహదారులు పూర్తయ్యాయని వాటికి తెలంగాణలో లింకురహదారి పూర్తి కాలేదని దీనికి నిదర్శణమే కెరమెరి మండలం జంగుబాయి దేవస్థానంఅన్నారు. గతంలో అనేకసమావేశాల్లో రహదారు లకు అనుమతుల విషయం జిల్లాఅటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్ప టికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే జిల్లాలో పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. అదే సందర్భంలో రానున్న రోజుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అటవీ ప్రాంతాల్లో మొరంతో రహదారులు నిర్మి స్తామని అప్పుడు ఎవరు అడ్డు పడుతారో చూస్తామంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు వివిధ శాఖలకు సంబంధిం చిన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారితనంగా ఉండాలన్నారు. జిల్లాలో అదేదీ కనిపించడం లేదన్నారు. పులుల మృతికి సంబంధించి ఆదివాసీలపై పెట్టిన కేసులను అక్రమమైనవిగా అభి వర్ణించారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పాలకవర్గం లేకపోవవడంతో బ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అంకు సాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన డైట్‌ భవనం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిశాఖల అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు తీసుకొనిసమావేశానికి రాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 10:30 PM