Share News

Kumaram Bheem Asifabad: డి క్యాటగిరీ ఓటింగ్‌ యంత్రాల భద్రతకు చర్యలు

ABN , Publish Date - May 20 , 2024 | 10:51 PM

ఆసిఫాబాద్‌, మే 20: డి కేటగిరి ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రతగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad: డి క్యాటగిరీ ఓటింగ్‌ యంత్రాల భద్రతకు చర్యలు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 20: డి కేటగిరి ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాల భద్రతగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమ వారం అదనపుకలెక్టర్‌ దాసరి వేణు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ దేశ్‌పాండే, ఎన్నికల పర్యవేక్షకులు మధుకర్‌, ఎన్నికల ఉపతహసీల్దార్‌ జితేందర్‌, రాజకీయపార్టీ ప్రతి నిధుల సమక్షంలో జిల్లా వేర్‌హౌజ్‌ నుంచి జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాంలో గల సీఅండ్‌డీ క్యాటగిరిస్ట్రాంగ్‌ రూంకు డి క్యాటగిరి ఈవీఎంలను తరలించి భద్రపరిచారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లావేర్‌హౌజ్‌ నుంచి డికేటగిరి ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తరలించి భద్రపరిచామన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నియమకాలను పాటించాలి

ఆసిఫాబాద్‌, మే 20: ప్రయాణంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా రవాణాశాఖ, పంచాయతీ రాజ్‌, రోడ్డు, భవనాల, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత చర్యల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన అన్నారు. జిల్లాలో బ్లాక్‌స్పాట్‌ జాబితాలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రవాణాదా రులపై ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ రాజ్‌, రోడ్డు భవనాలు, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు సమన్వయంతో విచారణ జరిపి బ్లాక్‌ స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పశువులు రోడ్లపైకి రాకుండా యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించటం, కార్లు, ఇతర వాహనా లలో సీట్‌బెల్టు ధరించడం, రోడ్డు భద్రత నియమాలను పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్పీడ్‌బ్రేకర్లు, మూలమలుపులు, ప్రమాద ప్రాంతాలు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రోడ్లు అనుసంధాన ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోలు, వాహనాలలో పరి మితికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు తీసు కోవాలన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణమే వైద్య సాయం అందించే 108అంబులెన్స్‌ వినియోగంపై ప్రజలకు వివరించాలన్నారు. కేజ్‌ వీల్స్‌తో రహదారులపై వాహనాలు నడపడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాహనంనడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్సు పొంది ఉండాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రతినెల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎస్పీ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ వివిధశాఖల సమన్వయంతో రోడ్డుప్రమాదాల నివారణకుచర్యలు తీసుకుంటా మన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్య లు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నడిపే సమయంలో భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాల న్నారు. జిల్లాలో 2021 లో 68, 2002లో 57, 2023లో 70 ప్రమాదాలు జరిగాయని ఈప్రమాదాల్లో 450 మందివరకు మృతిచెందారని అన్నారు. జిల్లాలో45 బ్లాక్‌స్పాట్‌ లను గుర్తించా మన్నారు. జాతీయ రహదారులశాఖ అధికారుల సమ న్వయంతో ఆయాప్రాంతాల్లో ప్రమాదాలనివారణకు ప్రత్యేకచర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 10:51 PM