Share News

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ కేంద్రంగా కూలర్ల తయారీ

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:22 PM

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 25: మండల కేంద్రంలో ఓం ఫ్యాబ్‌ ఇండియా కంపెనీ వారు తయారు చేస్తున్న వివిధ రకాల కూలర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. మండల కేంద్రానికి చెందిన రాకేష్‌ అగర్వాల్‌ ఆటో మొబైల్‌ రంగంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి 2000 సంవత్సరంలో కంపెనీ ప్రారంభించాడు.

Kumaram Bheem Asifabad:  కాగజ్‌నగర్‌ కేంద్రంగా కూలర్ల తయారీ

అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూలర్లు

- హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు సరఫరా

- మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త

- వేసవిలో మంచి డిమాండ్‌

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 25: మండల కేంద్రంలో ఓం ఫ్యాబ్‌ ఇండియా కంపెనీ వారు తయారు చేస్తున్న వివిధ రకాల కూలర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. మండల కేంద్రానికి చెందిన రాకేష్‌ అగర్వాల్‌ ఆటో మొబైల్‌ రంగంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి 2000 సంవత్సరంలో కంపెనీ ప్రారంభించాడు. మొదట్లో అంతంత మాత్రంగానే ఉండగా, క్రమంగా పురోభివృద్ధి చెందుతూ ఒక బ్రాండ్‌లాగా తయారైంది. ఈ కంపెనీలో 2, 3, 4, 5 ఫీట్ల కూలర్లు అందుబాటులో ఉంటున్నాయి. స్థానికంగానే కాకుండా ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, నిజమాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరతో పాటు ఎలాంటి సమస్య వచ్చిన కూడా వెంటన సర్వీసు అందిస్తుండటంతో ఈ కంపెనీ కూలర్లకు గిరాకీ బాగా పెరిగింది. ఒక వైపు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో కూలర్లను కొనుగోళ్లు పెరగనున్నాయి.

ఫ నలుగురికి ఉపాధి కల్పించేందుకు..

- రాకేష్‌ అగర్వాల్‌, యాజమాని, ఓం ఫ్యాబ్‌ ఇండియా

నేను ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. స్వయంగా చిన్నపాటి కూలర్ల తయారీ కంపెనీ పెట్టాను. తన లక్ష్యం నలుగురికి ఉపాధి కల్పించడం. వేసవి కంటే ముందుగానే ఏటా కూలర్ల గిరాకీ పెరుగుతుంది. వివిధ రకాల డిజైన్లతో చేసిన వాటిల్లో 2, 3, 4, 5 ఫీట్ల కూలర్లను తయారు చేస్తున్నాం. అందరికి అందుబాటులో ఉండే ధరలతో అమ్మకాలు సాగిస్తున్నాను.

Updated Date - Feb 25 , 2024 | 10:22 PM