Share News

Kumaram Bheem Asifabad: పిల్లల్లో పోషణ లోపాన్ని పూర్తిగా అరికట్టాలి

ABN , Publish Date - Mar 27 , 2024 | 10:16 PM

ఆసిఫాబాద్‌, మార్చి 27: పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అరికట్టా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. వారి బంగా రు భవిష్యత్‌కు పునాది వేసేది మంచి ఆహారం, విద్య మాత్రమేనని అన్నారు.

Kumaram Bheem Asifabad:  పిల్లల్లో పోషణ లోపాన్ని పూర్తిగా అరికట్టాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మార్చి 27: పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అరికట్టా లని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. వారి బంగా రు భవిష్యత్‌కు పునాది వేసేది మంచి ఆహారం, విద్య మాత్రమేనని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో జిల్లా స్త్రీశిశుసంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన పోషణ్‌ పక్వాడా కార్యక్రమానికి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్న ప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పిల్లల్లో0-6 సంవత్సరాల వయస్సు చాలా ముఖ్యమైనదన్నారు. ఆ సమయంలో వారిలో పోషకాహార లోపాన్ని నివారిం చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచే యాలని సూచించారు. బాల్యం నుంచే ఆత్మ విశ్వాసం పెరిగేలా ప్రోత్సహించాల న్నారు. పిల్లల ప్రగతికి బాటలు వేయాలంటే వారికి ముఖ్యంగా అందిం చాల్సినది పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన అల వాట్లు, విద్య మాత్రమేనని తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని వందశాతం అరికట్టాల న్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో భాస్కర్‌, సీడీపీవోలు సాదియా, సురేఖ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 10:16 PM