Share News

kumaram bheem asifabad: శాంతిభద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:40 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 29: సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ ఎ సురేష్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్సు కేంద్ర భద్రత బలగాల మార్చ్‌ను పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

kumaram bheem asifabad:  శాంతిభద్రతలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ

-ఎస్పీ సురేష్‌ కుమార్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 29: సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ ఎ సురేష్‌కుమార్‌ అన్నారు. గురువారం పట్టణంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్సు కేంద్ర భద్రత బలగాల మార్చ్‌ను పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వర్గ భేదాలు, అల్లర్లు లేకుండా ఉండేందుకు జిల్లాలో ఆయాప్రాంతాల్లో అవగాహన సదస్సులు, కవాతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో ఎవరైనా చట్ట విరుద్దంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కవాతు పట్టణంలోని ప్రఽధాన వీధుల గుండా సాగింది. కార్యక్రమంలో ఆర్‌ఎఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ జితేందర్‌ నందా వార్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రధాన్‌రమేష్‌ సీఐ సతీష్‌, టాస్క్‌ఫోర్సు సీఐ రాణా ప్రతాప్‌, సీఐ రమేష్‌, ఆర్‌ఐ పెద్దన్న, అంజన్న తదితరులున్నారు.

జిల్లాలో 30 పోలీసు

యాక్టు అమలు..

జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంతతను పెంచేందుకు శుక్రవారం నుంచి మార్చి 31వరకు జిల్లా అంతటా 30 పోలీసు యాక్టు అమల్లో ఉంటుం దని ఎస్పీ సురేష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 10:40 PM