Kumaram Bheem Asifabad: ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ABN , Publish Date - Mar 06 , 2024 | 09:47 PM
ఆసిఫాబాద్, మార్చి 6: లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీంలో ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్లాట్ల రెగ్యూలరైజేషన్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు

ఆసిఫాబాద్, మార్చి 6: లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీంలో ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్లాట్ల రెగ్యూలరైజేషన్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద ఏర్పాటుచేసిన ధర్నాలో ఆమెపాల్గొని మాట్లా డారు. కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చి మాటమార్చిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల నుంచి కనీసం రూ.లక్ష చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు సిద్ధమయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండి ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఎలాంటిఛార్జీలు లేకుండా ప్లాట్లను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలను చేపడతామన్నారు. ధర్నాలోనియోజకవర్గంలోని పదిమండలా లకు చెందిన బీఆర్‌ఎస్‌పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీమండల ఆధ్య క్షులు, సహకార చైర్మన్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.