Share News

Kumaram Bheem Asifabad: ఆసిఫాబాద్‌లో పోడుభూముల లొల్లి

ABN , Publish Date - May 31 , 2024 | 10:47 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 31: ఆసిఫాబాద్‌ మండలంలోని దానాపూర్‌ గ్రామంలో శుక్రవారం అటవీశాఖ అధికారులకు పోడుభూముల రైతులకు వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన 60మంది రైతులు కొన్ని సంవత్సరాలుగా 150ఎకరాల్లో అటవీభూమిని సాగు చేస్తు న్నారు.

 Kumaram Bheem Asifabad:   ఆసిఫాబాద్‌లో పోడుభూముల లొల్లి

- పోడు రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం

- వెనుతిరిగి వెళ్లిపోయిన అధికారులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 31: ఆసిఫాబాద్‌ మండలంలోని దానాపూర్‌ గ్రామంలో శుక్రవారం అటవీశాఖ అధికారులకు పోడుభూముల రైతులకు వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన 60మంది రైతులు కొన్ని సంవత్సరాలుగా 150ఎకరాల్లో అటవీభూమిని సాగు చేస్తు న్నారు. ఇదే క్రమంలో గతసంవత్సరం అప్పటి జిల్లాఅటవీశాఖ అధికారి శాంతారాం గ్రామా నికి వెళ్లి భూములుచూసి వాటినిస్వాధీనం చేసుకుంటామన్నారు. గ్రామస్తులతో చర్చలు జరిపి 10ఎకరాల భూమిని అటవీఅధికారులు తీసుకున్నారు. అప్పుడు జరిగిన ఒప్పందంమేరకు వచ్చేసంవత్సరం మరికొంత భూమి ఇస్తామని గ్రామ స్థులు ఒప్పుకున్నట్లు అటవీఅధికారులు చెబుతున్నారు. ఇదేక్రమంలో శుక్ర వారం సదరుభూములను చూడడానికి జిల్లాఅటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌, ఆసిఫాబాద్‌ ఎఫ్‌ఆర్వో అప్పలకొండ, డిప్యూటీరేంజ్‌అధికారి యోగేష్‌, బీట్‌అధికారి రవి వెళ్లగా గ్రామస్థులు వారిని ఊర్లోనే అడ్డు కున్నారు. గతంలోనే భూములు చూస్తామంటూ వచ్చి పదిఎకరాలు తీసుకున్నారని ప్రస్తుతం మరో సారి భూములు చూడడానికి ఒప్పుకోమని అడ్డుతగిలారు. అయితే గ్రామస్థుల దగ్గర ఏదైనా పత్రాలు ఉన్నాయా అని అటవీ అధికారులు అడగగా తాము బీసీకి చెందిన వారం కావడంతో ఎటువంటిపత్రాలు లేవన్నారు. అయినప్పటికీ భూములు వదులుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఒకవేళ అటవీ అధికా రులు భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరిం చారు. దీంతో అటవీఅధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు.

Updated Date - May 31 , 2024 | 10:47 PM