Share News

Kumaram Bheem Asifabad: లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:40 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 17: లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్నిజిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నామినేషన్ల ప్రక్రియ తుదిఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షించారు.

 Kumaram Bheem Asifabad:   లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 17: లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్నిజిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నామినేషన్ల ప్రక్రియ తుదిఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈనెల18నుంచి 25వరకు జరుగనున్న నామినేషన్ల స్వీకరణను పార దర్శకంగా నిర్వహించాలని అన్నారు. పెండింగ్‌ ఓటరునమోదు దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు స్లిప్పులు ప్రతి ఓట రుకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్నిఏర్పాట్లు చేయాల న్నారు. పోటీచేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాల న్నారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ప్రత్యేకబృందాలను నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దాసరివేణు, డీఆర్వో లోకేశ్వర్‌రావు,ఆర్డీవోకాశబోయిన సురేష్‌,డీఆర్డీవోసురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 10:40 PM