Share News

Kumaram Bheem Asifabad: పశుగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:09 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశుగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపుకలెక్టర్‌ దాసరి వేణు అన్నారు.

Kumaram Bheem Asifabad:   పశుగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

- అదనపు కలెక్టర్‌ దాసరి వేణు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశుగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపుకలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తనచాంబర్‌లో జిల్లా పశువైద్యాధికారి సురేష్‌కుమార్‌, వైద్యాధి కారులతో కలిసి 21వఅఖిలభారత పశుగణన, తెలంగాణ కార్యక్రమ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 21వ అఖిలభారత పశుగణన తెలంగాణకార్యక్రమం ఫిబ్రవరి28,2025వరకు కొనసాగు తుంద న్నారు. ప్రతిఇంటికి వెళ్లి పశువుల వివరాలు సేకరించి ప్రభు త్వం నిర్ణయించిన ఆన్‌లైన్‌పోర్టల్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు. జిల్లాలోని 15మండలాల్లో పశుగణన సర్వేకు 86మంది ఎన్యుమరేటర్లు, 11మంది సూపర్‌వైజర్లను నియ మించామన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను సమర్థ వంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో నోడల్‌అధికారి డాక్టర్‌విజయ్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:09 PM