Kumaram Bheem Asifabad: కుమరంభీం ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:58 PM
ఆసిఫాబాద్, జూలై 28: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ముసురువాన కురిసింది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు జిల్లాలోని 15 మండ లాల్లో శనివారం రాత్రి ఎడతెరిపి లేకుం డా వర్షం కురిసింది.

ఆసిఫాబాద్, జూలై 28: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ముసురువాన కురిసింది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు జిల్లాలోని 15 మండ లాల్లో శనివారం రాత్రి ఎడతెరిపి లేకుం డా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 20.6మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయింది. బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల్లో ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో పంటలకు నష్టం వాటి ల్లింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ముసురు వర్షానికి రోడ్లన్నీ బురదమ యంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కుమరం భీంప్రాజెక్టులో 3312 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో మూడు గేట్లు ఎత్తి1947క్యూసెక్కుల వరదనీరు కిందికి వదులు తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు అయిన వివరాలు ఇలా ఉన్నాయి..
జిల్లాలో అత్యధికంగా కౌటాలలో 32.4మిల్లీమీటర్లు, అత్యల్పంగా పెంచికలపేటలో 9మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగితా మండలాలైన దహెగాంలో 27మిల్లీమీటర్లు, బెజ్జూరులో 25.6, సిర్పూర్(టి)లో 24.8, కాగజ్‌నగర్‌లో 23.2, రెబ్బెనలో 23, వాంకిడి, చింతలమానే పలిల్లలో 22.6, జైనూరులో 20.2, లింగాపూర్‌లో 19.2, సిర్పూర్(యు)లో 16.8, తిర్యాణిలో 16.6, కెరమెరిలో 16.4, ఆసిఫాబాద్‌లో 10మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
వ్యవసాయ పనులకు ఆటంకం
జైనూర్: మండలకేంద్రంతోపాటు మారుమూల గ్రామాల్లో ఆదివారం ఎడతెరపి లేకుండా వర్షంకురిసింది. దీంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది. అదేవిధంగా రోజు వర్షం పడుతుండటంతో మారుమూల గ్రామాల్లో రోడ్లు బురవమయంగా తయారు కావడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.