Share News

Kumaram Bheem Asifabad: అనుమతుల కోసం సమన్వయంతో ముందుకు సాగుదాం

ABN , Publish Date - Jun 10 , 2024 | 10:22 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 10: జిల్లాలోని వివిధ రహదారులు, టవర్ల నిర్మాణం కోసం కావాల్సిన అటవీ అనుమతుల కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకుసాగాలని జిల్లా అటవీశాఖాధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రే వాల్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad:  అనుమతుల కోసం సమన్వయంతో ముందుకు సాగుదాం

- జిల్లా అటవీశాఖ అదికారి నీరజ్‌కుమార్‌ టిబ్రేవాల్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 10: జిల్లాలోని వివిధ రహదారులు, టవర్ల నిర్మాణం కోసం కావాల్సిన అటవీ అనుమతుల కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకుసాగాలని జిల్లా అటవీశాఖాధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రే వాల్‌ అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వ ర్యంలో పెండింగ్‌లో ఉన్న 24రహదారుతో పాటు వివిధటవర్ల నిర్మాణాలపై ఆసిపాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి వివిధ శాఖల అధికారులతో తనకార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్‌ లో ఉన్న రోడ్లలో రహదారులు భవనాల శాఖ 12అనుమతులు రావాల్సి ఉన్నాయని, వీటిలో 11కాంట్రాక్టర్ల వద్ద పెండింగ్‌ ఉన్నాయన్నారు. ఒకటి రాష్ట్రకార్యాలయంలో పెండింగ్‌లో ఉంద ని తెలిపారు. పంచాయతీరాజ్‌ విభాగంలో 7రోడ్లకు కాంట్రాక్టర్‌ వద్ద 5, 2అనుమతులు రహదారుల మంత్రిత్వశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న 5రోడ్లకు కాంట్రాక్టర్‌వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అలాగే జియోటవర్‌ నిర్మా ణంలో భాగంగా 6లో 5కాంట్రాక్టర్‌ వద్ద, 1తన వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. బీఎస్‌ ఎన్‌ఎల్‌, ఎయిటెల్‌ టవర్లకు సంబంధిం చి 7లో 4కాంట్రాక్టర్‌ వద్ద 2మంత్రిత్వశాఖ వద్ద, 1జిల్లా కార్యాల యంలో పెండింగ్‌లో ఉందన్నారు. జిల్లాలో వివిధ పనులకు సంబంఽధించి అటవీ శాఖ అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అయితే దరఖాస్తులు సరైనవిధంగా ఉండేలా చూడా ల్సిన బాధ్యత ఆయాశాఖలపై ఉందన్నారు. టెండర్‌ ప్రారంభ ప్రక్రియలోనే అటవీశాఖ అనుమతి తీసుకొని పనిప్రారంభిస్తే ఇబ్బం దులు రావన్నారు. వివిధశాఖల అధికారులు ఈ విషయం తెలిసి కూడా అటవీశాఖను దోషిగా ప్రజలవద్ద నిలబెట్టడం సరైంది కాద న్నారు. ఆయాశాఖలనుంచి వచ్చే ప్రతిపాద నలు పెండింగ్‌ లేకుండా చూస్తామన్నారు. ఎప్పటికప్పుడు అనుమతులు ఇచ్చే విధంగా రాష్ట్ర కార్యాలయంతో సంప్రదిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అనుమతులు త్వరిగతిన వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలో ఎక్కు వగా అటవీప్రాంతంతో ముడిపడి ఉన్న రహదారులు ఉన్నాయని, వాటి నిర్మాణానకి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ ఎఫ్‌ఆర్వో అప్పలకొండ, రహ దారులు భవనాలశాఖ ఈఈ పెద్దన్న తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 10:22 PM