Share News

Kumaram Bheem Asifabad: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం : ఎస్పీ

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:01 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని ఎస్పీ పిలుపునిచ్చారు.

Kumaram Bheem Asifabad: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం : ఎస్పీ

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుందామని ఎస్పీ పిలుపునిచ్చారు. నేటినుంచి ఈనెల31 వరకు పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్‌ ఫ్లాగ్‌ డేను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఫ్లాగ్‌ డేను పురస్కరించుకుని తొలిరోజు సోమవారం జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో అమరవీరుల సంస్మరణదినం నిర్వహిస్తామన్నారు. అలాగే అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతోపాటు శోక్‌శ్రస్త్‌ పరేడ్‌ నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు హాజరై అమరవీరులకు నివాళులు అర్పిస్తారన్నారు. అనంతరం కవాతు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరారు.

Updated Date - Oct 20 , 2024 | 11:01 PM