Share News

Kumaram Bheem Asifabad: జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితం అవుదాం

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:13 PM

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితం అవుదాం అని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 Kumaram Bheem Asifabad:   జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితం అవుదాం

- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జిల్లా సమగ్రాభివృద్ధికి పునరంకితం అవుదాం అని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వేడుకలను సాదాసీదాగా నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రగతి నివేదిక సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమపథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దేశప్రగతికి, విద్యాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం చేసి ఆదివాసులకు అండగా నిలిచిన కుమరం భీం జిల్లాకు చెందినవాడు కావడం గర్వకారణమన్నారు. తమ సంస్కృతీ సంప్ర దాయాలతో వైవిద్యతను చాటే గిరిజనులు తమకే సొంతమైన గుస్సాడీ నృత్యంలో పద్మశ్రీ అవార్డు పొంది జిల్లా పేరును దేశంలో నిలిపారని కొనియాడారు. జిల్లాలో ఎన్నికలు అద్యంతం ప్రశాం తంగా జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, దాసరి వేణు, జిల్లా అటవీశాఖాధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రే వాల్‌, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ సురేష్‌కుమార్‌

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సురేష్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసుసిబ్బంది కృషి చేయాలన్నారు. అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో రాష్ట్రంలోనే జిల్లాకు ఇంకా మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌ రావు, డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అమరవీరులకు జర్నలిస్టుల నివాళులు

ఆసిఫాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆదివారం జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంతోనే స్వరాష్ట్రాన్ని సాధించు కోవడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్క రించుకుని ఆదివారం జిల్లాకేంద్రంలో ఆయాప్రభుత్వ కార్యాల యాల్లో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరావు, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీని వాసరావు, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ భుజంగరావు, జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీవో రాంచందర్‌, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ కార్యాలయంలో ఈఈ ప్రభాకర్‌రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌అహ్మద్‌, మిషన్‌భగీరథ కార్యాలయంలో ఈఈ వెంకటపతి జాతీయజెండాలను ఎగురవేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు జాతీయజెండాను ఎగురవేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

Updated Date - Jun 02 , 2024 | 10:15 PM