Share News

Kumaram Bheem Asifabad: శివాజీ స్ఫూర్తితో ధర్మ పరిరక్షణకు పాటుపడుదాం

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:25 PM

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 11: ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తితో ధర్మ పరి రక్షణకు పాటుపడదామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Kumaram Bheem Asifabad:  శివాజీ స్ఫూర్తితో ధర్మ పరిరక్షణకు పాటుపడుదాం

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 11: ఛత్రపతి శివాజీ మహారాజ్‌ స్ఫూర్తితో ధర్మ పరి రక్షణకు పాటుపడదామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైందవ ధర్మపరిరక్షణ కోసం శివాజీ మహారాజ్‌ చేసిన పోరాటం మనందరికీ చిరస్మర ణీయమని అన్నారు. ఆరెకుల అభివృద్ధికోసం పాటు పడుతామని, వారికి కేంద్రప్ర భుత్వం తర్వలోనే ఓబీసీ సర్టిఫికేట్‌ ఇవ్వనుంద న్నారు. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణంలో కూడా పెద్దఎత్తున శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని నెలకొల్పు తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శంకర్‌, సత్యనారాయణ, ఆరె సంఘం నాయకులు కిశోర్‌ పాల్గొన్నారు.

మొక్కులు చెల్లించుకున్న

ఎమ్మెల్యే హరీష్‌ బాబు

కాగజ్‌నగర్‌: మహారాష్ట్రలోని దాబా వద్ద గల కొండయ్య మహారాజ్‌ సమాధిని ఆదివారం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాబా కమిటీ వారు సిర్పూరు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సన్మానం చేశారు.

Updated Date - Feb 11 , 2024 | 10:25 PM