Share News

Kumaram Bheem Asifabad : లాహిరి.. లాహిరి.. ‘లహరి’లో

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:26 PM

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 11: ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా ప్రజల సౌకర్యార్థం లహరి స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక డిపోకు ఇటీవల 2 ఏసీ బస్సులు ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా ఆసిఫాబాద్‌కు ప్రతీరోజు రెండు బస్సులను నడిపిస్తున్నారు.

Kumaram Bheem Asifabad :  లాహిరి.. లాహిరి.. ‘లహరి’లో

-ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా లహరి బస్సు ప్రారంభం

-హైదరాబాద్‌ వెళ్లేందుకు సీటర్‌ కం స్లీపర్‌ కోచ్‌

-అధునాతన హంగులతో ఏసీ స్లీపర్‌ కోచ్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 11: ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా ప్రజల సౌకర్యార్థం లహరి స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్థానిక డిపోకు ఇటీవల 2 ఏసీ బస్సులు ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ స్టేషన్‌ నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా ఆసిఫాబాద్‌కు ప్రతీరోజు రెండు బస్సులను నడిపిస్తున్నారు. ప్రతి నిత్యం రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో బస్సుల ప్రయాణం వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. దూరప్రాంతం ప్రయాణాలు చేసే వారికి ఈ బస్సులు అనువుగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. బస్సులో కూర్చుని ప్రయాణించే సీట్లు 33ఉండగా పైన స్ల్లీపర్‌ బెర్తులు 15ఉన్నాయి. కూర్చునే, పడుకొనే సీట్ల మధ్య ధరల మధ్య వ్యత్యాసం ఉంది. తొలిసారిగా లహరి ఏసీ బస్సు స్లీపర్‌ కోచ్‌తో ప్రారంభించడంతో మంచి డిమాండ్‌ వస్తోంది. లహరి బస్సుల మంజూరుతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తొలిసారి కాగజ్‌నగర్‌ నుంచి స్లీపర్‌ బస్సు..

గతంలో కేవలం రైళ్ల ద్వారానే స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణించే వీలుండేది. కానీ ప్రస్తుతం అన్ని హంగులతో కూడిన ఏసీ స్లీపర్‌ బస్సులు జిల్లాకు రావడంతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు తొలిసారి కాగజ్‌నగర్‌ నుంచి స్లీపర్‌ బస్సు నడిపిస్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ నుంచి నూతనంగా 2లహరి బస్సులు ప్రారంభించారు. ఒకటి ఆసిఫాబాద్‌ నుంచి హైద్రాబాద్‌కు ఉదయం 9-30 బయలు దేరుతుంది. అలాగే మళ్లీ రాత్రి హైద్రాబాద్‌లో 9-15 బయలుదేరి ఆసిఫాబాద్‌కు ఉదయం 9గంటలకు చేరుకుంటుంది. స్లీపర్‌ బస్సు హైదరాబాద్‌కు రూ.850, స్లీపర్‌ రూ.1180గా ధరలు నిర్ణయించారు. ఈ బస్సులకు ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కూడా ఉంది. టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవల ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని ఆసిఫాబాద్‌ డిపో మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. రాత్రి ఆసిఫాబాద్‌ నుంచి బయలుదేరే బస్సు కాగజ్‌నగర్‌, రెబ్బెన, తాండూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరిఖని మీదుగా హైదరాబాద్‌ వరకు వెళుతుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి రాత్రి బయలు దేరే బస్సు మాత్రమే ఎంజీబీఎస్‌, జేబీస్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ మీదుగా ఆసిఫాబాద్‌ వరకు నడుస్తుంది. రెండు బస్సుల్లో రాత్రి పూట నడిచే బస్సులు కాగజ్‌నగర్‌ మీదుగా నడుస్తాయని మిగిలిన రెండు ఆసిఫాబాద్‌ నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్‌ వెళతాయని డీఎం వివరించారు.

లహరి బస్సు సేవలు సద్వినియోగం చేసుకువాలి..

- శ్రీధర్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌, ఆసిఫాబాద్‌

హైదరాబాద్‌కు నడిపిస్తున్న లహరి బస్సులను అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాత్రిపూట నడిచే బస్సులు మాత్రమే ఆసిఫాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లనున్నాయి. ముందస్తుగా టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునే వీలుంది. ఆసిఫాబాద్‌ నుంచి ఉదయం 9.30కు, రాత్రి 9.15కు, హైదరాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌కు ఉదయం 9.00కి, రాత్రి 8.30కు లహరి బస్సులు అందుబాటులో ఉంటాయి.

Updated Date - Feb 11 , 2024 | 10:26 PM