Share News

Kumaram Bheem Asifabad: వేతనం పెంపును కూలీలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:23 PM

వాంకిడి, మార్చి 28: ఉపాధి హామీ కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రోజు వారి వేతనం పెంచుతున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం అద నపు కలెక్టర్‌ దీపక్‌తివారి, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి సురేందర్‌తో కలిసి బెండార, వాంకిడి గ్రామాల్లో గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగు తున్న నీటికుంట నిర్మాణం, కాలువ పూడికతీత పనులను పర్యవేక్షించారు. అర్హత గల ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు.

Kumaram Bheem Asifabad:   వేతనం పెంపును కూలీలు సద్వినియోగం చేసుకోవాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

వాంకిడి, మార్చి 28: ఉపాధి హామీ కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రోజు వారి వేతనం పెంచుతున్నామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం అద నపు కలెక్టర్‌ దీపక్‌తివారి, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి సురేందర్‌తో కలిసి బెండార, వాంకిడి గ్రామాల్లో గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగు తున్న నీటికుంట నిర్మాణం, కాలువ పూడికతీత పనులను పర్యవేక్షించారు. అర్హత గల ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. రోజు వారి కూలి రూ.300 చొప్పున పెంచుతామని, ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన బెండార గ్రామ సెక్రెటరీ నియమాళిక, మండల పంచాయతీ అధికారి ఖాజా అజీజుద్దీన్‌కు షోకాజు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పనిచేసే కూలీలు వేతనాలు పొందడంలో పోస్టల్‌ శాఖ పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అకౌంట్లు లాక్‌ పడి ఉన్నా సరిచేయడం లేదని తెలపగా పోస్టల్‌శాఖతో మాట్లాడి చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, మండల పంచాయతీ అధికారి, ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎనోలి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మంచినీరు, విద్యుత్‌, రోడ్డు సదుపాయాలు కల్పించాలని గ్రామస్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో సక్రమంగా నీటిసరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామంలో విద్యుత్‌, రోడ్డు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:23 PM