Share News

Kumaram Bheem Asifabad: మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా ఉంచాలి: ఎస్పీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:50 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 19: పార్ల మెంట్‌ ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాలో, సరిహద్దుల్లో మద్యం, నగదు అక్రమ రవాణాపై నిఘా ఉంచి పట్టుకోవాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశిం చారు.

Kumaram Bheem Asifabad: మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా ఉంచాలి: ఎస్పీ

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 19: పార్ల మెంట్‌ ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాలో, సరిహద్దుల్లో మద్యం, నగదు అక్రమ రవాణాపై నిఘా ఉంచి పట్టుకోవాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హా లులో జిల్లాపోలీసు అధికారులతో సర్కిల్‌ వారీగా ఎస్పీ నెలవారి నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. నేరసమీక్షలో ఆయా పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులలో అరెస్ట్‌ల పెండింగ్‌లకు గల కారణాలను తెలుసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నమోదైన కేసులలో కొన్ని కేసులు ఇంకా యూఐలో ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. యూఐ కేసులకు అవసరమైన డీఎన్‌ఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ మెడికల్‌ రిపోర్ట్‌ను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే తెప్పించుకొని కోర్టులో చార్జిషీట్‌ వేయాలని సూచించారు. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనలప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించా లన్నారు. సమావే శంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ సదయ్య, కరుణాకర్‌, సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:50 PM