Share News

Kumaram Bheem Asifabad: ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:17 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 17: ఆసిఫాబాద్‌ పట్ట ణంలోని బీఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నా రు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

Kumaram Bheem Asifabad:  ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 17: ఆసిఫాబాద్‌ పట్ట ణంలోని బీఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదినవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నా రు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లికార్జున్‌, సహకార చైర్మన్‌అహ్మద్‌,వెంకన్న,బాలేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌,వెంకన్న, నిస్సార్‌,ఆహ్మద్‌,అన్సార్‌, సుగుణాకర్‌ పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు): కేసీఆర్‌ జన్మదిన వేడుకలను మండల బీఆర్‌ఎస్‌పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకు న్నారు. కేక్‌, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీమార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, వైస్‌ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌, సహకార సంఘం చైర్మన్‌ కేంద్రే శివాజీ,మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

లింగాపూర్‌: మండలకేంద్రంలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు బీఆర్‌ఎస్‌నాయకులుఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆత్రంఅనిల్‌, లక్యానాయక్‌, గైరిబాయి గనపత్‌, రాహూల్‌,కిషన్‌,నాను,హసిరాం,రమేశ్‌ పాల్గొన్నారు.

వాంకిడి: మండల కేంద్రంలో శనివారం మాజీ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, ఎంపీటీసీ ప్రవీణ్‌, మాజీ సర్పంచ్‌ తుకారాం, నాయకులు సదాశివ్‌, రాకేష్‌, అష్యుతోష్‌, కమలాకర్‌,రవి తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో బీఆర్‌ ఎస్‌ నాయకులురోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా గ్రంథాలయ మాజీచైర్మన్‌ కనకయాదవ్‌రావ్‌, మేస్రాం అంబాజీరావ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఆత్రంశంకర్‌, నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీహెచ్‌సీలో రోగు లకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు ప్రసాద్‌, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ దస్తగీర్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 10:17 PM