Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్ మార్కెట్‌కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:58 PM
కాగజ్‌నగర్, జూన్ 17: కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా సుద్దాల దేవయ్య, వైస్‌చైర్మన్‌గా వార్ల తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు.

కాగజ్‌నగర్, జూన్ 17: కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా సుద్దాల దేవయ్య, వైస్‌చైర్మన్‌గా వార్ల తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ కమిటీ మార్కెట్‌కమిటీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. అనంతరం కొత్తగా ఎంపికైన సభ్యులను ఘనంగా సన్మానించారు.
అభినందించిన మాజీ ఎమ్మెల్యే..
నూతనంగా ఎన్నికైన కాగజ్‌నగర్ మార్కెట్‌కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, వైస్‌చైర్మన్ వార్ల తిరుపతిని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభినందించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావిశ్రీనివాస్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.