Share News

Kumaram Bheem Asifabad: యువతను సన్మార్గంలో నడపడమే జాబ్‌మేళా లక్ష్యం

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:36 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 26: జిల్లా లోని యువతను సన్మార్గంలో నడపడం కోసమే జాబ్‌మేళా న్విహిస్తున్నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. సోమవారంం పోలీ సులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టాటియాగార్డెన్స్‌లో నిర్వహించిన జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Kumaram Bheem Asifabad:   యువతను సన్మార్గంలో నడపడమే జాబ్‌మేళా లక్ష్యం

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 26: జిల్లా లోని యువతను సన్మార్గంలో నడపడం కోసమే జాబ్‌మేళా న్విహిస్తున్నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. సోమవారంం పోలీ సులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టాటియాగార్డెన్స్‌లో నిర్వహించిన జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువతను సన్మార్గంలో నడపడాలనే ఉద్దేశ్యంతో జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఎటు వంటి ఉద్యోగం, సంపాదన లేనప్పుడు యువత ఆలోచనలు అసాంఘిక కార్యకలా పాలవైపు మల్లే అవకాశం ఉందన్నారు. ఉద్యోగంలో చిన్నా, పెద్ద తేడా చూడకుండా చేసే ఉద్యోగంలో తనకంటూ ప్రత్యేకత సాధించాలన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది కిందిస్థాయి నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. జిల్లాకు చెందిన వ్యక్తి నిలోఫర్‌ కేఫ్‌ యజమానిగా మారాడంటే దానివెనక ఉన్న శ్రమ అర్థం చేసుకోవ చ్చన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ప్రదర్శించాలన్నారు.

అప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందన్నారు. యువత నమ్మకం, నిజాయితీ, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. అవి ఉంటే ఎక్కడైనా విజయం సాఽధ్యమవుతుందన్నారు. జాబ్‌మేళా నిర్వహణ కోసం ఆసిఫాబాద్‌కు నూతనంగా వచ్చిన డీఎస్పీ సదయ్యను ఆయన అభినందించారు. జాబ్‌మేళా విజయవంతం కావడానికి జిల్లా పోలీసు యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్‌, సదయ్య, సీఐలు సతీష్‌, శ్రీనివాస్‌, రాణాప్రతాప్‌, చిట్టిబాబు, ఆర్‌ఐ పెద్దన్న, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 10:36 PM