Kumaram Bheem Asifabad: ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తే ఉత్తర తెలంగాణకు మేలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:46 PM
కౌటాల, జూన్ 12 : మండలంలోని తుమ్డిహేట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తే ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

-మెగా ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం ప్రాణహిత ప్రాజెక్టు
-హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు
కౌటాల, జూన్ 12 : మండలంలోని తుమ్డిహేట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తే ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బుధవారం వారు తుమ్డిహేట్టి ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు పనులు చేపడితే తుమ్డిహేట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారానే నీటిని తరలించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఇరిగేషన్ అధికారులకు, సీఎం రేవంత్ రెడ్డికి త్వరలోనే వివరిస్తామన్నారు. తుమ్డిహేట్టి వద్ద 148మీట్లర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేసేందుకు గతంలో మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందని కూడా వివరించారు. కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టు అవుతుందని గతంలోనే తాము పేర్కొన్నట్టు వివరించారు. తుమ్డిహేట్టి వద్ద ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తాటిచెట్టు ఎత్తు మునిగేస్థాయి నీరు ఉండటం గొప్ప విషయమన్నారు. ఇక్కడ ప్రాజెక్టు కడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈఅంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. కేంద్రంనుంచి 60శాతం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎస్‌ఈ భీమయ్య, పుల్లారెడ్డి, శ్రీరాం రెడ్డి, చీఫ్ ఇంజనీర్ రఘుమారెడ్డి, వెంకటయ్య, హన్మంత్‌రెడ్డి, వెంకటరమణ, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.