Share News

Kumaram Bheem Asifabad: ఈ రోడ్లపై ప్రయాణం ఎలా?

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:59 PM

పెంచికలపేట/బెజ్జూరు, జూలై 31: వర్షాలకు పలుగ్రా మాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధానరహ దారులు సైతం దెబ్బ తిన్నాయి.

Kumaram Bheem Asifabad:   ఈ రోడ్లపై ప్రయాణం ఎలా?

పెంచికలపేట/బెజ్జూరు, జూలై 31: వర్షాలకు పలుగ్రా మాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధానరహ దారులు సైతం దెబ్బ తిన్నాయి. ఆగర్‌గూడ, కనర్‌గాం, నందిగాం, మురళిగూడ, జిల్లెడ గ్రా మాల ప్రజలు మండల కేంద్రానికి రావాలన్నా గ్రామాలు దాటిబయటకు వెళ్లాలన్న బురదనీరు, రాళ్లు తేలిన గుంతల రోడ్డునుదాటి గమ్యంచేరడమంటే పద్మవ్యూహాన్ని చేధించడమే అవు తోంది. వర్షంపడితే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. ఆదమరిస్తే ప్రమాదంజరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

బెజ్జూరు మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో కార్యాలయ పనుల కోసం వెళ్లే ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 09:59 PM