Share News

Kumaram Bheem Asifabad: ధ్యానంతోనే ఆరోగ్యం

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:20 PM

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 21: ధ్యానంతోనే ఆరోగ్య వంత మైన జీవితం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎంవీ రమేష్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad:  ధ్యానంతోనే ఆరోగ్యం

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 21: ధ్యానంతోనే ఆరోగ్య వంత మైన జీవితం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎంవీ రమేష్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రత్యేక సబ్‌జైలులో ‘ధ్యానంతో సంతోషకరమైన ఆరోగ్యవంతమైన జీవితం’ అనే అంశంపై విచారణ ఖైదీలకు రెండు రోజుల అవగాహన కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెడుఅలవాట్లైన మద్యం, ధూమపానం, మత్తు పదార్థాలవల్ల నియంత్రణ కోల్పోయి నేరాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి చెడువ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈసందర్భంగా ఖైదీలకు అందుతున్న సౌక ర్యాలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలుసూపరింటెండెంట్‌ ప్రేంకు మార్‌, బ్రహ్మకుమారి రాణి,కోర్టుసిబ్బందిడివెంకటేశ్వర్లు,అంజనదేవి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 10:20 PM