Share News

Kumaram Bheem Asifabad: గ్రూప్‌-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 20 , 2024 | 10:47 PM

ఆసిఫాబాద్‌, మే 20: జూన్‌ 9న జరగనున్న గ్రూప్‌-1 పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావర ణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్‌పర్సన్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ సురేష్‌తో కలిసి జిల్లా అధికారు లతో పరీక్ష నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

 Kumaram Bheem Asifabad:   గ్రూప్‌-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 20: జూన్‌ 9న జరగనున్న గ్రూప్‌-1 పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావర ణంలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో టీఎస్‌పీఎస్‌ చైర్‌పర్సన్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ సురేష్‌తో కలిసి జిల్లా అధికారు లతో పరీక్ష నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 9న జరగనున్న గ్రూప్‌-1 పరీక్షకు అధికారులు సమ న్వయంతో పనిచేయాలని తెలిపారు. పరీక్షల నిర్వ హణకు అదనపు కలెక్టర్‌ను నోడల్‌ అధికారిగా నియ మించామన్నారు. సంబంధిత అధికారులను సమ న్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్ష నిర్వహించాలని తెలిపారు. పరీక్ష కొరకు సమీ కృత జిల్లాకార్యాలయాల భవన సముదాయంలో స్ట్రాంగ్‌రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీసు బందోబస్తుమధ్య పరీక్షకేంద్రాలకు తరలిం చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 13కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. 4ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. ఈ క్రమంలో శాఖపరమైన సమస్యలను వెంటనేపరిష్కరించుకొని పరీక్ష నిర్వహ ణకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘికశక్తుల నియంత్రణ పై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. స్ట్రాంగ్‌రూంవద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షి స్తామని తెలిపారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరుగుతా యన్నారు. సంబంధిత అధికారులకు 22న శిక్షణ ఇస్తామని తెలిపారు. పరీక్షకేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విషయ పరిజ్ఞానం ఉండాలన్నారు. పరీక్షసమయాన్ని గంట మొగిస్తూ అభ్యర్థులకు తెలియజేయాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థు లకు ఉదయం 9గంటలకు ఏర్పాటు చేయబడిన పరీ క్షాకేంద్రంలోనికి అనుమతి ఉంటుందన్నారు. 9.30 గంటలకు బయోమెట్రిక్‌ చెకింగ్‌తోపాటు 10గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఉంటుందన్నారు. 10 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోని అనుమతించరని తెలిపారు. సెల్‌ఫోన్‌, ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుతించమని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ సమీపంలోని జిరాక్స్‌ సెంట ర్లను మూసి ఉచాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఒక వైద్యబృందాన్ని నియమించి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరీక్ష సమయంలో అభ్యర్థు లకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా పారిశుధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా అంశాలపై ప్రత్యేకచర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్ష నిర్వ హణలో అధికారులు నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..

జిల్లాలో జరగనున్న ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, పాలిసెట్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బం దీగా నిర్వ హించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్ట ర్‌లు దీపక్‌తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేష్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ ఆర్డీవో సురేష్‌తో కలిసి జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహ ణపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1200మంది విద్యార్థులు పదవ తరగతి సప్లిమెం టరీ పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. అందులో ఆసిఫాబాద్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలి కల పాఠశాల, కాగజ్‌నగర్‌ పట్టణం లోని ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాల, సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షాకేంద్రాలు ఏర్పా టు చేశామని తెలిపారు, జూన్‌ 3నుంచి 13వరకు ఉదయం 9.30 నుంచి 12.30గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఈనెల 24నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రథమసంవత్సరంలో 1938మంది, ద్వితీయ సంవత్స రంలో 1051మంది విద్యార్థులు హాజరు కానున్నారని అన్నారు. ఇందు కోసం జిల్లాలోని ఆసిఫాబాద్‌లో 2, కాగజ్‌నగర్‌లో 2, జైనూరు, తిర్యాణి, రెబ్బెన, కౌటాల, వాంకిడి, కెరమెరి, సిర్పూర్‌(యు)లో ఒక్కోకేంద్రం చొప్పున ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈనెల 24న పాలిసెట్‌ పరీక్షనిర్వహణకు జిల్లాలో 4పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనేపథ్యంలో సంబం ధిత శాఖల ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని తెలి పారు. పరీక్షల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ అవకాశం లేకుండా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తార న్నారు. అలాగే సకాలంలో పరీక్షా కేంద్రాలకు విద్యా ర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడిపిం చాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా అవసర మైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్‌సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవా లని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 10:47 PM