Kumaram Bheem Asifabad : జిల్లాకుచేరుకున్న గ్రూప్-1పరీక్ష ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్‌లు
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:35 PM
ఆసిఫాబాద్, జూన్ 7: ఈనెల 9న జిల్లాలో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్‌లు జిల్లాకు చేరుకున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తెలిపారు.

ఆసిఫాబాద్, జూన్ 7: ఈనెల 9న జిల్లాలో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్‌లు జిల్లాకు చేరుకున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్‌తివారి తెలిపారు. శుక్రవారం జిల్లాకు చేరుకున్న గ్రూప్1 సర్వీసెస్ ప్రిలిమిరీ పరీక్ష ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌షీట్‌లను జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లోగల స్ట్రాంగ్‌రూంలో పూర్తిబందోబస్తు మధ్య భద్రపరి చామని తెలిపారు. జిల్లాలోగ్రూప్-1ప్రిలిమినరీ పరీక్షపకడ్బందీగా నిర్వహించేం దుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లను మూసిఉంచామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల జిల్లా సమన్వయకర్త లక్ష్మినరసింహ, జిల్లా ఖజానాఅధికారి రాజేశ్వరి, ఆసిఫా బాద్ సీఐ సతీష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మునావర్ షరీఫ్ పాల్గొన్నారు.