Kumaram Bheem Asifabad: ఘనంగా బక్రీద్ పండుగ
ABN , Publish Date - Jun 17 , 2024 | 10:54 PM
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, జూన్ 17: జిల్లాలో సోమవారం బక్రీద్‌పండగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతోపాటు 5మండలాల్లో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, జూన్ 17: జిల్లాలో సోమవారం బక్రీద్‌పండగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతోపాటు 5మండలాల్లో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా జిల్లాకేంద్రంలోని బాబాపూర్ రోడ్డులో గల ఈద్గావద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలిం గనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు మైనార్టీలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీనాయకులు సింగిల్ విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు తారిక్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో స్థానిక ఈద్గా కాంగ్రెస్‌పార్టీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావిశ్రీనివాస్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు చేరుకొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలో కూడా పలుగ్రామాల్లో ఈద్గా ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
మండలాల్లో..
వాంకిడి/బెజ్జూరు/దహెగాం/ పెంచికలపేట/సిర్పూర్(యు)/ సిర్పూర్(టి)/చింతలమానేపల్లి/రెబ్బెన/కెరమెరి: మండలాల్లో సోమవారం బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకు న్నారు. వాంకిడి, గోయగాం, బెజ్జూరు మండల కేంద్రంతోపాటు ఎల్కపల్లి, మర్తిడి, కుకుడ, గోల్కొండ, దహెగాం మండలంలో బీబ్ర, మొట్లగూడ, సిర్పూర్(యు), పెంచికల పేట మండల కేంద్రం, సిర్పూర్(టి) మండల కేంద్రంలోని పాత, కొత్తఈద్గాల్లో, మండలం లోని లోనవెల్లి, వెంపల్లి, చింతలమానేపల్లి మండలంకేంద్రంతో పాటు బాబాసాగర్, గూడెం, డబ్బా, రన్‌వెల్లి, కెరమెరి మండల కేంద్రంతోపాటు ఝరి, సుర్దాపూర్ తదితర గ్రామాల్లో, రెబ్బెనలోని గోలేటి టౌన్‌షిప్‌లో ఈద్గాతోపాటు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.