Kumaram Bheem Asifabad : భయంగుప్పిట్లో అటవీగ్రామాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:07 PM
పెంచికలపేట/చింతలమానేపల్లి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతమైన గడ్చిరోలి అటవీప్రాంతంలో ఏనుగు కదిలికలు జిల్లాలోని అటవీగ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తు న్నాయి.

- సరిహద్దుల్లో ఏనుగు సంచారంపై ఆందోళన
- నలుగురు సభ్యులతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
పెంచికలపేట/చింతలమానేపల్లి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతమైన గడ్చిరోలి అటవీప్రాంతంలో ఏనుగు కదిలికలు జిల్లాలోని అటవీగ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తు న్నాయి. ఏ క్షణంలో ఏనుగు గ్రామాల మీద విరుచుకుపడుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలో ఏనుగు ఉన్నట్లు సమాచారం ఇటు ప్రజలకు అటు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
గ్రామస్థులకు అవగాహన..
అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒంటరిగా ఎవరూ చేన్లలోకి వెళ్లకూడదని, ఏనుగు వెంబడించే ప్రయత్నంగాని, ఫొటోలుతీసే ప్రయత్నం గాని చేయకూడదని తెలిపారు. అలాగే ఏనుగుకు ఎలాంటి హాని తలపెట్టవద్దని అది తారాస పడితే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు..
ఈ నేపథ్యంలో అఽధికారులు అప్రమత్తమయ్యారు. సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్ల మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వ హించారు. ఏనుగు కదిలికలపై ఆరాతీశారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఎఫ్‌ఆర్వో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సై నలుగురు సభ్యులతో కూడిన హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అటవీప్రాంత గ్రామాలైన కొండపల్లి, లోడ్పల్లి, కమ్మర్‌గాం, మురళీగూడ గ్రామాల్లో గ్రామానికి నలుగురు సభ్యులను ఏర్పాటు చేశారు. అలాగే 15మంది ఎనిమిల్ ట్రాకర్స్‌ను అందుబాటులో ఉంచారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో అనీల్‌కుమార్‌ను వివరణ కోరగా యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఎలిఫెంట్ మూమెంట్‌లో భాగంగా మండల అటవీశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు కదిలికలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.