Share News

Kumaram Bheem Asifabad: అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:35 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆది వారం నుంచి ఈనెల 20 వరకు వారోత్సవాలు నిర్వ హించనున్నట్లు లీడింగ్‌ఫైర్‌ ఆఫీసర్లు సంపత్‌, సతీష్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆది వారం జిల్లాకేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో జెండాను ఆవిష్కరించి వారోత్సవాలు ప్రారంభించారు.

Kumaram Bheem Asifabad:  అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 14: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆది వారం నుంచి ఈనెల 20 వరకు వారోత్సవాలు నిర్వ హించనున్నట్లు లీడింగ్‌ఫైర్‌ ఆఫీసర్లు సంపత్‌, సతీష్‌ పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆది వారం జిల్లాకేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో జెండాను ఆవిష్కరించి వారోత్సవాలు ప్రారంభించారు. అగ్నిమాపకశకటాలు, యంత్రసామగ్రి ప్రదర్శణ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా అమరులైన సిబ్బందికి ఘనంగా నివాళులుఅర్పించారు. అనంతరం వారు మాట్లా డుతూ వారంరోజులపాటు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే నియంత్రణకోసం చేపట్టాల్సిన ప్రాథమిక చర్యలు, నియంత్రణ విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బస్టాండు, రైల్వే స్టేషన్‌, పార్కు, మార్కెట్‌ఏరియాలతోపాటు ఎల్‌పీజీగ్యాస్‌ వినియోగదారులకు, విద్యుత్‌ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది నాగేశ్వర్‌, విలాస్‌, కుమారస్వామి, మహేష్‌, జనార్దన్‌, తులసీదాస్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మురళీమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో అగ్నిప్రమాదాల అధికంగా జరుగుతాయని, ఈవిషయంలో అంతాఅప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకు ముందు అగ్నిమాపకశాఖ అమరవీరులకు మౌనంపాటించారు. విద్యార్థులకు అగ్నిమాపకప్రమాదాల నివారణపై అవగాహణ కల్పించారు. కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 10:35 PM