Share News

Kumaram Bheem Asifabad: ‘ఉపాధి’ పనులకు కసరత్తు

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:42 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 26: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పనులు కీలకంగా మారాయి. ప్రభుత్వం సైతం ఉపాధిహామీ నిధులను సమర్థవంతంగా వినియోగించు కుంటూ నీటిసంరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో కూలీలకు పను లను కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Kumaram Bheem Asifabad:  ‘ఉపాధి’ పనులకు కసరత్తు

- 2024-25 ఆర్థిక సంవత్సరానికి పనుల గుర్తింపు

- రూ.347 కోట్ల అంచనా

- చేపట్టాల్సిన పనులపై గ్రామపంచాయతీల్లో తీర్మాణాలు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 26: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పనులు కీలకంగా మారాయి. ప్రభుత్వం సైతం ఉపాధిహామీ నిధులను సమర్థవంతంగా వినియోగించు కుంటూ నీటిసంరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో కూలీలకు పను లను కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ప్రతి కుటుంబానికి వందరోజుల ఉపాధికల్పించడమే లక్ష్యంగా 38,32,763 పనిదినాలను ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.347కోట్ల బడ్జెట్‌ అవసరమవుతుందని ప్రాథ మికంగా అంచనా వేశారు.

పక్కా పనులకు ప్రాధాన్యం..

గ్రామాల నుంచి వలసలను నిరోధించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాతీయ ఉపాధిహామీ పథకం రూపుది ద్దుకుంది. అయితే ప్రారంభంలో నిధుల వినియోగ తీరుపై నామమాత్రపు పనులు చేపట్టడంతో పథకం అమలుపై విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంఏటా చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి అవసరమైన నిధులు విడుదల చేసే విధంగా మార్పులు చేసింది. అలాగే కూలీల హాజరును పకడ్బందీగా నమోదు చేస్తూ పారదర్శకతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. 2024-25ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 15మండలాల పరిధిలో చేపట్టాల్సిన పనులను ‘ఉపాధి’ సిబ్బంది ఇప్పటికే గుర్తించారు. మూడు నెలల ముందు నుంచి గ్రామ సభలు నిర్వహిస్తూ పంచాయతీల్లో అవసరమైన పనులపై తీర్మాణాలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో శాశ్వత పనులను అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా నీటిసంరక్షణ, భూగర్భజలాలు పెంపు లక్ష్యంగాపనులు చేపట్టాలని నిర్ణయించారు. ఫాంపాండ్స్‌, బావుల పూడికతీత, వాలు కట్టలు, ఇంకుడుగుంతలు, భూముల చదును, కంపోస్టు పిట్లు, పండ్ల తోటలు, వ్యవ సాయషెడ్లు, మరుగుదొడ్లు, నర్సరీలు తదితర పనులు చేపట్ట నున్నారు. ప్రస్తుత 2023-24ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం చేరుకునేందుకు ఉపాధిహామీ సిబ్బంది శ్రమిస్తున్నారు. కూలీలను పనికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2024-25ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో కూలీల పని దినాలను పూర్తి చేసేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.

మండలాల వారీగా పనిదినాలు..

జిల్లాలోని 15మండలాల్లోని 335గ్రామపంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ఉపాధిహామీ పథకంలో కూలీలకు కల్పించే పనిదినాలు ఈ విధంగా ఉన్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలో 3,33,770పనిదినాలు, బెజ్జూరులో 3,15,451 పనిదినాలు, చింతలమానేపల్లిలో 1,92,017పనిదినాలు, దహెగాంలో 3,21,855 పనిదినాలు, జైనూరులో 2,02,015 పని దినాలు, కాగజ్‌నగర్‌లో 2,90,975 పని దినాలు, కెరమెరిలో 3,49,515 పనిదినాలు, కౌటాలలో 3,10,000 పనిదినాలు, లింగాపూర్‌లో 1,65,220 పనిదినాలు, పెంచికలపేటలో 1,52,090 పనిదినాలు, రెబ్బెనలో 2,60,078 పనిదినాలు, సిర్పూర్‌(టి)లో 1,86,320 పనిదినాలు, సిర్పూర్‌(యూ)లో 2,69,000 పనిదినాలు, తిర్యాణిలో 2,51,727 పనిదినాలు, వాంకి డిలో 2,32,800 పనిదినాలు కల్పించేందుకు అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.

ఉపాధి కూలీలందరికీ పని కల్పించడమే లక్ష్యం..

- సురేందర్‌, డీఆర్డీవో

జిల్లాలో కూలీలందరికీ ఉపాధి హామీలో పని కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. 2024-25ఆర్థిక సంవత్సరానికి పనులను గుర్తించాం. ఇందుకోసం రూ.347కోట్ల బడ్జెట్‌ అవస రమవుతుందని ప్రాథమికంగా అంచనా వేశాం.

Updated Date - Feb 26 , 2024 | 10:42 PM