Share News

Kumaram Bheem Asifabad: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:12 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 4: పార్లమెంట్‌ ఎన్ని కల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత డిసెంబర్‌ నెలలో విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్ప డగా జిల్లాలో మాత్రం వ్యతి రేక ఫలితాలు వచ్చాయి.

Kumaram Bheem Asifabad:   పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

- బస్టాండ్‌లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 4: పార్లమెంట్‌ ఎన్ని కల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత డిసెంబర్‌ నెలలో విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్ప డగా జిల్లాలో మాత్రం వ్యతి రేక ఫలితాలు వచ్చాయి. అయితే పార్లమెంట్‌ ఎన్ని కల్లో అయినా కాంగ్రెస్‌ ఫలితాలు అను కూలంగా రావడానికి శ్రేణులు పడ్డకష్టాలపై ప్రజల్లో నాయకుల్లో తీవ్ర ఉత్కం ఠ నెలకొంది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై చర్చజరిగింది. పార్లమెంట్‌ ఫలితాల నేపథ్యంలో ఉదయం నుంచి అందరు టీవీలకు అతుక్కుపోవడంతో జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ బోసిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే కూర గాయల మార్కెట్‌ మంగళవారం అదేదీ లేకుం డా బోసిపోయింది. కూరగాయలు అమ్మేవారు కూడా సెల్‌ఫోన్‌లో ఫలితాలు చూస్తూ కనిపించారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు చూడడానికి ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. దీంతో పెద్దఎత్తున ప్రయాణికులు అక్కడికి చేరుకొని చూడడం కనిపించింది. ఎల్‌ఈడీ ఏర్పాటు చేయడంతో బస్టాండు ప్రాంతం ఫలితాల కోసం చూసే వారితో నిండిపోయింది.

Updated Date - Jun 04 , 2024 | 11:12 PM