Share News

Kumaram Bheem Asifabad : ప్రతి పోలీసూ క్రమశిక్షణ కలిగి ఉండాలి: ఎస్పీ

ABN , Publish Date - Feb 15 , 2024 | 10:35 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 15: పోలీసు శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ క్రమ శిక్షణ కలిగి ఉండాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అన్నారు. 15రోజులుగా జిల్లా పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో జరుగుతున్న జిల్లా ఆర్మ్‌డ్‌రిజర్వ్‌ సిబ్బంది మొబిలైజే షన్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మ్‌డ్‌సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవం దనం స్వీకరించారు.

 Kumaram Bheem Asifabad :  ప్రతి పోలీసూ క్రమశిక్షణ కలిగి ఉండాలి: ఎస్పీ

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 15: పోలీసు శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ క్రమ శిక్షణ కలిగి ఉండాలని ఎస్పీ సురేష్‌ కుమార్‌ అన్నారు. 15రోజులుగా జిల్లా పోలీసుహెడ్‌క్వార్టర్స్‌లో జరుగుతున్న జిల్లా ఆర్మ్‌డ్‌రిజర్వ్‌ సిబ్బంది మొబిలైజే షన్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మ్‌డ్‌సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవం దనం స్వీకరించారు. మూడు ప్లటూన్ల తో ఏర్పాటు చేసిన ఈ పరేడ్‌కు అడ్మిన్‌ ఆర్‌ఐ పెద్దన్న ప్లటూన్‌ కమాండర్‌గా వ్యవహరించారు. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్‌, ఔట్‌డోర్‌, ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబి లైజేషన్‌ ద్వారా శారీరక ధ్రుడత్వంతోపాటు మాన సిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు. అద్భుతంగా చేసిన పరేడ్‌ను చూస్తే తమశిక్షణ రోజులు గుర్తొస్తు న్నాయని అన్నారు. ప్రజల ధన, మాన ప్రాణాలు కాపాడడం, శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీ సుశాఖ ముఖ్య లక్ష్యమన్నారు. నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యక్తిగత కుటుంబపరమైన, శాఖపరమైన సమస్యలను పరి ష్కరించేందుకు ఎల్లప్పుడు ముందుంటా మని వివ రించారు. ఈ డి-మొబిలైజేషన్‌ పరేడ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు. కార్య క్రమంలో ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, అడ్మిన్‌ ఆర్‌ఐ పెద్దన్న, ఎంటీవో ఆర్‌ఐ అంజన్న, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బదిలీపై వెళ్తున్న పోలీసు అధికారులకు సన్మానం..

జిల్లాలో పనిచేసి బదిలీపైవెళ్తున్న పోలీసు అధికా రులను ఎస్పీ సురేష్‌కుమార్‌ గురువారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉద్యోగంలో బదిలీ అనేది సహజం అని అన్నారు. ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు జిల్లాలో ఎంతో కృషి చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, జిల్లాలో వివిధముఖ్యమైన బందోబస్తులు విజయ వంతంగా పూర్తిచేయడంలో ఎంతోకృషి చేశారన్నారు. మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో తనకృషి అమ్యూలమైనదని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉత్తమసేవలు అందించారన్నారు. అనంతరం బదిలీపైవెళ్తున్న ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, డీసీఆర్బీ డీఎస్పీ రమేష్‌, సూపరింటెండెట్‌లు ఎండీ ఇంకేశవ అలీ,శ్రీనివాస్‌ను సన్మానించారు. కార్యక్ర మంలో డీఎస్పీలు సదయ్య, కరుణాకర్‌, సీఐ రాణాప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన డీఎస్పీ..

ఆసిఫాబాద్‌ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సదయ్య గురువారం ఎస్పీ సురేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజే శారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినం దించారు.

Updated Date - Feb 15 , 2024 | 10:35 PM