Share News

Kumaram Bheem Asifabad: జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకుడు

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:48 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్రవిజయ్‌ గురువారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పైన ఏమైనా సందే హాలు, ఫిర్యాదులు ఉంటే 8523876384ను సంప్రదిం చవచ్చన్నారు.

Kumaram Bheem Asifabad: జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకుడు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్రవిజయ్‌ గురువారం జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పైన ఏమైనా సందే హాలు, ఫిర్యాదులు ఉంటే 8523876384ను సంప్రదిం చవచ్చన్నారు. ఆదిలాబాద్‌లోని పెన్‌గంగా అతిథి గృహంలో మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు నేరుగా కలవవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. స్వీప్‌ యాక్టివిటీస్‌లో భాగంగా ఓటరు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫ్లెక్సీ వద్ద జిల్లాఎన్నికల అధికారులతో కలిసి ఫొటో దిగారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావర ణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పరిశీలకులకు జిల్లాఎన్నికల అధికారులు వివరించారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగ తం పలికారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ దాసరి వేణు, తహసీల్దార్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్‌ అధికశాతం అయ్యేట్టు చూడాలి..

కాగజ్‌నగర్‌: వచ్చేనెల 13న జరిగే పార్లమెంట్లు ఎన్నికల్లో అధికశాతం పోలింగ్‌ అయ్యేట్టు చూడాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్‌ తెలిపారు. గురువారం కాగజ్‌నగర్‌లో ఎన్నికల నిర్వహణ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌కు అర్హత గల ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేట్టు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్‌, స్టాటిక్‌ సర్వేయలెన్స్‌, వీడియో సర్వేయలెన్స్‌, వీడియో పరిశీలన, సహాయఖర్చుల పరిశీలకులు, అకౌంటింగ్‌ బృందాలు, కంట్రోల్‌రూం, ఖర్చుల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులతోపాటు అదనపు సిబ్బందిని కూడా నియమించినట్టు తెలిపారు.ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేట్టు చూడాలన్నారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడుతూ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేట్టు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 85సంవత్సరాల వయసుపై బడిన వృద్ధులు, పోలింగ్‌ కేంద్రాలకు రాలేని దివ్యాంగులు హోం ఓటింగ్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 09:48 PM