Share News

Kumaram Bheem Asifabad: మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:37 PM

బెజ్జూరు, జనవరి 12: మండలకేంద్రంలో మినీ స్టేడియం మంజూరుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాఆబు అన్నారు. శుక్రవారం మండలంలోని కుంటలమానేపల్లి గ్రామంలో యువకులు ఏర్పాటుచేసిన కుమరంభీం గ్రామీణ వాలీబాల్‌ క్రీడాపోటీలను ఆయన ప్రారంభిం చారు.

Kumaram Bheem Asifabad: మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా

- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

బెజ్జూరు, జనవరి 12: మండలకేంద్రంలో మినీ స్టేడియం మంజూరుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాఆబు అన్నారు. శుక్రవారం మండలంలోని కుంటలమానేపల్లి గ్రామంలో యువకులు ఏర్పాటుచేసిన కుమరంభీం గ్రామీణ వాలీబాల్‌ క్రీడాపోటీలను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాల న్నారు. క్రీడలు నిర్వ హించిన యువకులు అభినందనీయులన్నారు. మండలంలో ఎక్కడైనా స్థలం పరిశీలన చేయా లని అధికారులకు సూచించారు. ఐటీడీఏ నిధులు ఎస్టీలకు చేరేలా చర్యలు తీసుకుంటామని, సమస్యలుంటే తమ దృష్టికితీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తా మని తెలిపారు. ఎమ్మెల్యేకు సర్పంచ్‌ విజయ్‌, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం తుమ్మలగూడలో వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశ్వకర్మ యోజన పథకానికి చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవా లన్నారు. పంటలకు మందుల పిచికారి చేసే డ్రోన్‌ యంత్రాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో ఏఈ మక్బుల్‌, కార్యదర్శి వెంకన్న, పీఈటీలు ధర్మయ్య, పుల్లయ్య, మహేష్‌, సర్పంచ్‌ విజయ్‌, మాజీ సర్పంచ్‌ రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పతాకావిష్కరణ..

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ సర్‌సిల్క్‌ సద్గురు దేవానంద ఆశ్రమంలో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు నిర్వహించి పలు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:37 PM