Share News

Kumaram Bheem Asifabad: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:41 PM

ఆసిఫాబాద్‌, మార్చి 4: ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని అదనపుకలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

 Kumaram Bheem Asifabad:  ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి

- అదనపు కలెక్టర్‌ దాసరి వేణు

ఆసిఫాబాద్‌, మార్చి 4: ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని అదనపుకలెక్టర్‌ దాసరి వేణు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెబ్బెన మండలం కొండపల్లికి చెందిన భారతి తాను పదవతరగతి చదువుకున్నానని తనకు ఉపాధికల్పిం చాలని దరఖాస్తు అందజేసింది. రెబ్బెన మండలం గోలేటికి గ్రామానికిచెందిన గౌతం గ్రామశివారులో తనభూమి రికార్డుల్లో నమోదు కాలేదని, సింగరేణి భూసేకరణ రీసర్వే చేయించి ఆదుకోవాలని దరఖాస్తు అందజేశారు. వాంకిడి మండలం మార్కగూడ గ్రామానికి చెందిన కోవ బాపు రావు గిరివికాస కింద బోరు వేయించానని విద్యుత్‌కనెక్షన్‌ ఇప్పించాలని అర్జీలు సమర్పించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన పెందూర్‌ భువనేశ్వరి తాను కులంతార చేసుకున్నానని ఇద్దరుపిల్లలతో అద్దెఇంట్లో నివాసం ఉంటు న్నానని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ పట్టణం బసంతినగర్‌కు చెందిన సుబోద్‌ తనకు వృద్దాప్య పెన్షన్‌ మంజూరుచేయాలని, పెంచకలపేట మండలం ఆగర్‌ గూడకు చెందిన శారద తనభర్త తెలంగాణ సాసం్కృతికసారధి కళాకారుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడని తనకూతురు చదువు, పోషణకోసం ఉపాధి కల్పించాలని అర్జీ సమర్పించింది. దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన భీమయ్య తన తాతకు చెందిన భూములు ఇతరుల పేరిట రికార్డయ్యాయని, దీన్ని సవరించి వారసులమైన తమపేరిట నమోదు చేయాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని కాపువాడకు చెందిన పోతరాజుల ప్రమీల తనకు భట్టుపల్లి శివారులో వారసత్వ భూమి ఉందని ఈ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. కాగజ్‌నగర్‌ మండలం చింతగూడ(కె)కు చెందిన పిర్సింగుల శోభ వితంతుపెన్షన్‌ మంజూరు చేయాలని అర్జీ సమర్పిం చారు. ఆసిఫాబాద్‌ పట్టణానికిచెందిన మీసేవఆపరేటర్‌ గడ్డల ప్రణయ్‌కు మార్‌ ధరణి పోర్టల్‌లో క్యాన్సల్‌ అయినస్లాట్‌యొక్క రీఫండ్‌డబ్బులను ఇప్పిం చాలని వినతిపత్రాన్ని అందజేశారు. గోలేటికిచెందిన పోశం తనతాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమివివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసి పాసుపుస్తకం ఇప్పించాలని, గోలేటికి చెంది మాధవి తనకు గ్రామ శివారులో ఉన్న ఇల్లు భూసేకరణలో పోతోందని రీసర్వేచేయించి పునరావాసం, జీవనోపాధి కల్పించా లని దరఖాస్తు అందజేసింది.

Updated Date - Mar 04 , 2024 | 10:41 PM