Share News

Kumaram Bheem Asifabad:గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 23 , 2024 | 10:22 PM

ఆసిఫాబాద్‌, మే 23: జూన్‌9న జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో ప్రశాంత వాతావ రణంలో నిర్వహించేందుకు అధికా రులు కృషి చేయాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు.

 Kumaram Bheem Asifabad:గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 23: జూన్‌9న జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో ప్రశాంత వాతావ రణంలో నిర్వహించేందుకు అధికా రులు కృషి చేయాలని కలెక్టర్‌ వెంక టేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్‌-1పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఏఎస్పీ ప్రభా కర్‌రావుతో కలిసి కలెక్టర్‌ పరిశీ లించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 13కేంద్రాలను ఏర్పాటు చేయగా 2783మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. ఈపరీక్షా కేంద్రంలో 210మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని అన్నారు. వారికి ఫర్నీచర్‌, విద్యుత్‌, తాగునీరు, వసతులను కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమె రాల ఏర్పాట్లు ఉండేలా చూస్తామ న్నారు. ప్రతి పరీక్షాకేంద్రంవద్ద 144సెక్షన్‌ ఉంటుంద న్నారు. పరీక్షా కేంద్రానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. అభ్యర్థులకు యోమెట్రిక్‌ విధానం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో సంబంధిత అధి కారులకు వచ్చేనెల 22న శిక్షణ ఇస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో నియమించబడిన ఇన్విజిలేట ర్లకు విషయపరిజ్ఞానం ఉండా లన్నారు. అభ్యర్థులు ఒకగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. 9.30గంటలకు బయోమెట్రిక్‌ చెకింగ్‌తో పాటు 10గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఉంటుంద న్నారు. 10 దాటిన తరువాత అనుమతిం చరని తెలిపారు. సెల్‌ఫోన్‌తో పాటు ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించమని తెలిపారు. కార్యక్రమంలో రీజనల్‌ కో ఆర్డినే టర్‌ నర్సింహం, ప్రిన్సిపాల్‌, సీఐ తదితరులు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 10:22 PM