Share News

Kumaram Bheem Asifabad: అభివృద్ధి చెందాలంటే చదువు ఒక్కటే మార్గం: ఎస్పీ

ABN , Publish Date - Dec 29 , 2024 | 10:25 PM

తిర్యాణి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ తరాలు మారా లన్న అభివృద్ది చెందాలన్నా చదువు ఒక్కటే మార్గమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండలంలోని మంగి గ్రామంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించారు.

Kumaram Bheem Asifabad:  అభివృద్ధి చెందాలంటే చదువు ఒక్కటే మార్గం: ఎస్పీ

- మంగిలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంపు

తిర్యాణి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌ తరాలు మారా లన్న అభివృద్ది చెందాలన్నా చదువు ఒక్కటే మార్గమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండలంలోని మంగి గ్రామంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ చదువుతోనే జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగిలో తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో చిచిత మెగావైద్యంశిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆదివాసీలు అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి పోలీసు శాఖ, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. అనంతరం డాక్టర్లు గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. క్యాంపులో వైద్యంతోపాటు 500దుప్పట్లు, 10 వాలీబాల్‌ కిట్లు, విద్యార్థులకు పెన్నులు, మందులు పంపిణీ చేశారు. క్యాంపునకు వచ్చిన వారికి భోజనవసతి కల్పించారు. మెగా హెల్త్‌క్యాంపు విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులకు ఎస్పీ ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ కరుణాకర్‌, సీఐ బుద్ధే స్వామి, ఎస్సై మాధవ్‌, డాక్టర్‌లు కుమారస్వామి, రఘువంశీ, శ్రీధర్‌బాబు, రోజ, కావ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 10:25 PM