Share News

Kumaram Bheem Asifabad : నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకూడదు: ఏఈవోలు

ABN , Publish Date - May 25 , 2024 | 10:50 PM

ఆసిఫాబాద్‌, మే 25: రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయ వద్దని ఏఈవోలు రాము, నైతం రాములు అన్నారు. శనివారం మండలంలోని గోవిందాపూర్‌, ఎల్లారం, గంటల గూడ గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవ గాహన కల్పించారు.

Kumaram Bheem Asifabad :  నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకూడదు: ఏఈవోలు

ఆసిఫాబాద్‌, మే 25: రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయ వద్దని ఏఈవోలు రాము, నైతం రాములు అన్నారు. శనివారం మండలంలోని గోవిందాపూర్‌, ఎల్లారం, గంటల గూడ గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలపై అవ గాహన కల్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా లూజుగా ఉన్న సంచుల్లోని విత్తనాలు కొను గోలు చేయవద్దన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాల న్నారు. విత్తన ప్యాకెట్‌లు, బిల్లులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. గుర్తింపు పొందిన అధీకృత డీలర్‌ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్యాక్‌ చేసిన, లేబుల్‌ విత్తనాలు మాత్రమే తీసుకోవాలని, గడువు ముగిసిన విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు. ఎవరైనా లూజుగా విత్తనాలు అమ్మితే వ్యవసాయ, పోలీసు శాఖకు సమాచారం అందించాలన్నారు.

Updated Date - May 25 , 2024 | 10:50 PM