Kumaram Bheem Asifabad: జంగో లింగో దీక్షలు తీసుకోవాలి: ఎంపీ
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:41 PM
జైనూర్, జనవరి 12: గోండిధర్మ సంస్కృతి పరిరక్షణ కోసం ఆదివాసులు తప్పనిసరిగా జంగో లింగో దీక్షలు తీసుకోవాలని ఆది లాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. మండ లంలో గల జంగో లింగో పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఆయన సత్యనిష్ఠతో కిషన్‌రావ్ మహరాజ్ చేతుల మీదుగా జంగోలింగో దీక్ష తీసుకున్నారు.

- ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్
జైనూర్, జనవరి 12: గోండిధర్మ సంస్కృతి పరిరక్షణ కోసం ఆదివాసులు తప్పనిసరిగా జంగో లింగో దీక్షలు తీసుకోవాలని ఆది లాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. మండ లంలో గల జంగో లింగో పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఆయన సత్యనిష్ఠతో కిషన్‌రావ్ మహరాజ్ చేతుల మీదుగా జంగోలింగో దీక్ష తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. జంగో లింగో దీక్షల పుణ్యంతోనే తాను ఎంపీగా ఉన్నానన్నారు. జంగో లింగో దీక్షతో రోజుల పాటు కఠోర నియమాలతో ఉన్నప్పుడు కుటుంబంలో శాంతి ఏర్పడటమే కాకుండా ఇబ్బందులు, కష్టాలు క్రమంగా దూరమవుతా యని అన్నారు. చిన్నారులను విద్యావంతులుగా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో గోండిధర్మ పరిరక్షణ సమితి పీఠాధిపతి కుంరం భగ్వంత్‌రావ్, సర్పంచ్ కుంరం శ్యాంరావ్, గోండి కోయ పుణ్యం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం ఆనంద్‌రావ్, కుంరంభీం మనుమడు కుంరం సోనేరావ్, ఘన సాంస్థాన్ అధ్యక్షుడు ఆత్రం రఘునాథ్, భక్తులు పాల్గొన్నారు.