Share News

Kumaram Bheem Asifabad: ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీచేసిన జిల్లా వ్యవసాయాధికారి

ABN , Publish Date - May 31 , 2024 | 10:49 PM

కౌటాల, మే 31: మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు శుక్రవారం ఏవో రాజేష్‌తో కలిసి తనిఖీ చేశారు.

Kumaram Bheem Asifabad:  ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీచేసిన జిల్లా వ్యవసాయాధికారి

కౌటాల, మే 31: మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు శుక్రవారం ఏవో రాజేష్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా విత్తనచట్టం1966ను పాటించాల న్నారు. నాణ్యమైనవిత్తనాలు రైతులకు అందుబా టులో ఉంచాలన్నారు. రైతులు విత్తన కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రస్తుతం అన్ని దుకాణాల్లో బీటి-2(బోల్‌గార్డ్‌-2) విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

మండలాల్లో తనిఖీ చేసిన అఽధికారులు

రెబ్బెన: రెబ్బెనలో ఫెర్టిలైజర్‌ దుకాణాలను తహసిల్దార్‌ జ్యోత్స్న, ఎస్సై చంద్రశేఖర్‌, ఏవో మంజుల శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్‌ వివరాలు పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని, అధిక ధరలకు విత్తనాలు అమ్మరాదన్నారు.

దహెగాం: విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలుపాటించాలని ఎంఈవో ఆనంద్‌ అన్నారు. మండలంలోని హత్తిని, కుంచవెల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కల్వాడ గ్రామంలో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో రిజిస్టర్లను పరిశీలించారు.

వాంకిడి: విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని ఏఈవోలు సూచించారు. శుక్రవారం మండలంలోని పలుగ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.

Updated Date - May 31 , 2024 | 10:49 PM