Share News

Kumaram Bheem Asifabad: విలక్షణం.. జిల్లా ప్రజల తీర్పు

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:16 PM

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 4: ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది. అయితే కుమరం భీం ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవకర్గాల్లో ఓటర్లు తీర్పు విలక్షంగా ఉంది.

 Kumaram Bheem Asifabad:  విలక్షణం.. జిల్లా ప్రజల తీర్పు

-ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌, సిర్పూరులో బీజేపీకి ఆధిక్యం

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 4: ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది. అయితే కుమరం భీం ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవకర్గాల్లో ఓటర్లు తీర్పు విలక్షంగా ఉంది. ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి 16 టేబుళ్లు ఏర్పాటు చేసి 23రౌండ్లలో ఓట్లు లెక్కించారు. అదేవిధంగా సిర్పూరు నియోజకవర్గానికి సంబంధించి 14టేబుళ్లను ఏర్పాటు చేసి 23రౌండ్లలో ఓట్లు లెక్కించారు. ఆసిపాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు 73,996ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి గోడం నగేష్‌కు 47,056ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆత్రం సక్కుకు 38,597ఓట్లు వచ్చాయి. అలాగే సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 62,956 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 71,325 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 19,840ఓట్లు వచ్చాయి. ఆసిఫాబాద్‌నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 26,940ఓట్ల ఆధికత్యలో ఉండగా, సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థికి 8369ఓట్లు ఆధిక్యంగా వచ్చాయి. జిల్లాకు పరిశీలిస్తే ఓట్ల లెక్కిం పునకు సంబంధించి కాంగ్రెస్‌ ఆధిక్యతను చాటుకుంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,36,952 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,18,381 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మూడోస్థానానికి పరిమితం అయ్యారు. ఆయనకు 58,432ఓట్లు వచ్చాయి. దీంతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ తీర్పును విలక్షణంగా ఇచ్చారు. కౌటింగ్‌ కేంద్రాన్ని పరిశీలకులు హిమాన్షు కుమార్‌గుప్తా, జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, దాసరి వేణు పరిశీలించి ఎప్పటికప్పుడు కౌంటింగ్‌ సిబ్బందికి సూచనలు, సలహాలను ఇచ్చారు.

నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్లు

ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో...

===================================

రౌండు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ

===================================

1 960 3674 3489

2 1185 3368 2955

3 1447 3052 2467

4 1907 3016 1760

5 1750 4876 2638

6 1565 3128 2561

7 1656 3214 1375

8 1358 3002 2440

9 1942 1697 1684

10 1830 3727 1489

11 1845 2418 3575

12 2749 2944 673

13 2171 2146 691

14 1285 4128 4276

15 1337 4518 2131

16 1630 2549 1781

17 1541 4204 1896

18 1477 3314 2078

19 2509 4135 1908

20 2174 3373 1886

21 1927 3653 1469

22 1760 3185 1645

23 590 675 187

================================

38597 73996 47056

================================

సిర్పూరు నియోజకవర్గంలో..

===================================

రౌండు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ

===================================

1 529 1968 5073

2 379 1232 6843

3 684 2623 2869

4 726 3148 4345

5 413 3462 3927

6 709 3730 2765

7 443 3383 2655

8 646 3650 3545

9 674 2690 1624

10 771 2752 3502

11 940 2552 2428

12 1189 3350 3001

13 595 4052 2620

14 993 3248 2841

15 1184 2511 4706

16 1560 2304 1784

17 1006 2697 2047

18 1188 2001 2868

19 1019 2749 2446

20 1195 2611 2357

21 1212 1958 2850

22 867 2176 2329

23 916 2101 2900

===================================

19840 62956 71325

===================================

Updated Date - Jun 04 , 2024 | 11:16 PM