Share News

Kumaram Bheem Asifabad: జిల్లా కేంద్రంలో అస్తవ్యస్థంగా డ్రెయినేజీ వ్యవస్థ

ABN , Publish Date - May 26 , 2024 | 10:37 PM

ఆసిఫాబాద్‌, మే 26: ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో డ్రెయి నేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై వరదనీరుచేరి చెరువులను తలపిస్తున్నాయి.

 Kumaram Bheem Asifabad: జిల్లా కేంద్రంలో అస్తవ్యస్థంగా డ్రెయినేజీ వ్యవస్థ

- చిన్న వర్షానికే చెరువులను తలపిస్తున్న రోడ్లు

ఆసిఫాబాద్‌, మే 26: ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలో డ్రెయి నేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపై వరదనీరుచేరి చెరువులను తలపిస్తున్నాయి. గతంలో జిల్లాకేంద్రం మేజర్‌ గ్రామపంచాయతీగా కొన సాగగా ఇటీవల మున్సిపాలిటీగా మారింది.

పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, మురికి కాలు వలో పూడికపేరుకు పోవడంతో వర్షాకాలంలో తరుచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే వరదనీరు రోడ్లపైకిచేరి చెరువులను తలపి స్తున్నాయి. దీంతో పట్టణవాసులు తీవ్రఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.

మున్సిపాలిటీగా మారిన తరువాత పరిస్థితి మారు తుందని అనుకున్నా అవేకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి కైనా అధికారులు దృష్టిసారించి డ్రెయినేజీని ఎప్పటి కప్పుడు శుభ్రం చేసి వరదనీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసు కోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 10:37 PM