Share News

Kumaram Bheem Asifabad: కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:32 PM

ఆసిఫాబాద్‌, మార్చి 12: అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్ట రేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

Kumaram Bheem Asifabad:  కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

ఆసిఫాబాద్‌, మార్చి 12: అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్ట రేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి త్రివేణి మాట్లా డుతూ అంగన్‌వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీక రిస్తూకేంద్రాలలో సీసీకెమెరాలు, బయోమెట్రిక్‌ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. వెంటనే దానిని ఉపసంహరిం చుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఒకపూట బడితోపాటు మే నెలంత సెల వులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనిచేయని సెల్‌ఫోన్లను తిరిగి తీసుకొని కొత్తట్యాబ్‌లను ఇవ్వా లని కోరారు. 24రోజుల సమ్మె హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరండిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లాసంక్షేమాధికారి భాస్కర్‌ కు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, అంగన్‌ వాడీ యూనియన్‌ నాయకులు గంగమణి, వనిత, వినోద, ఉమదేవి, శ్రీనివాస్‌, రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 10:32 PM