Share News

Kumaram Bheem Asifabad: అభ్యర్థుల ఖర్చుల వివరాలు నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 10:46 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 19: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయపార్టీల అభ్యర్థుల ఖర్ఛుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదిలాబాద్‌ పార్ల మెంట్‌ ఎన్నికల వ్యయపరిశీలకుడు డాక్టర్‌ వివేకానంద్‌రాజేంద్ర జదావర్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad:  అభ్యర్థుల ఖర్చుల వివరాలు నమోదు చేయాలి

- వ్యయ పరిశీలకుడు డాక్టర్‌ వివేకానంద్‌ రాజేంద్ర జదావర్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 19: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజకీయపార్టీల అభ్యర్థుల ఖర్ఛుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదిలాబాద్‌ పార్ల మెంట్‌ ఎన్నికల వ్యయపరిశీలకుడు డాక్టర్‌ వివేకానంద్‌రాజేంద్ర జదావర్‌ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌జిల్లా కలెక్టర్‌ కార్యా లయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్‌లు, ఎన్నికల విభాగం అధి కారులతో ఎన్నికలఖర్చులవివరాల నమోదు పర్యవేక్షణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ సభ ఎన్నికలనేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో భాగంగా చేసే ప్రతి ఖర్చును తప్పనిసరిగా లెక్కించాలని తెలి పారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో ఎన్నికల ప్రవ ర్తన నియమావళి పక డ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సురేష్‌కుమార్‌, అద నపుకలెక్టర్‌ దాసరి వేణు, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీలు సద య్య, కరుణాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాలకు ఓటింగ్‌ యంత్రాలు..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఓటింగ్‌ యంత్రా లను ఆయాకేంద్రాలకు తరలించామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని వేర్‌హౌజ్‌లో భద్రపరిచిన ఓటింగ్‌యంత్రాలను అదనపు కలెక్ట ర్‌లు దీపక్‌తివారి, దాసరివేణు, ఆసి ఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఆర్డీవోలు లోకే శ్వర్‌రావు, సురేష్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓటింగ్‌పరికాలు కేటాయిం చామని కలెక్టర్‌ తెలిపారు. ముందుగా ర్యాండమైజేషన్‌ నిర్వహించి అనం తరం కేటాయించిన ఈవీఎంలను స్కానింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి391 బ్యాల టింగ్‌ యూనిట్లు, 391 కంట్రోల్‌ యూనిట్లు, 448 వీవీ ప్యాట్‌లు, సిర్పూర్‌ నియోజక వర్గానికి 352బ్యాలటింగ్‌ యూనిట్లు 352 కంట్రోల్‌ యూనిట్లు, 403 వీవీప్యాట్లను కంటైనర్ల ద్వారా పోలీసు బందోబస్తు మధ్య తరలించామని తెలిపారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో, సిర్పూర్‌ నియోజక వర్గానికి సంబంధించి కాగజ్‌ నగర్‌ పట్టణంలోని సెయింట్‌ క్లారెట్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్ర పరుస్తామని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాటించాల్సిన నియమనిబంధనలను, మార్గదర్శకాలను అధికారులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌లు, ఎన్నికల విభాగం అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 10:46 PM