Share News

Kumaram Bheem Asifabad: ఎస్పీఎం అడ్డుగోడల కూల్చివేత

ABN , Publish Date - Mar 18 , 2024 | 10:18 PM

కాగజ్‌నగర్‌, మార్చి 18: కాగజ్‌నగర్‌ ఎస్పీఎం యాజమాన్యం ప్రధాన రహదారికి అడ్డంగా నిర్మించిన గోడలను మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం కూల్చివేశారు. మాస్టర్‌ప్లాన్‌ అమలులో భాగంగా మూడునెలల క్రితం జిల్లాకలెక్టర్‌తోపాటు ఎస్పీఎం యాజమాన్యానికి మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులను పంపించారు.

Kumaram Bheem Asifabad: ఎస్పీఎం అడ్డుగోడల కూల్చివేత

-మున్సిపల్‌ సిబ్బందితో యాజమాన్యం వాగ్వాదం

-కొనసాగిన పనులు, పరిశీలించిన ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌, మార్చి 18: కాగజ్‌నగర్‌ ఎస్పీఎం యాజమాన్యం ప్రధాన రహదారికి అడ్డంగా నిర్మించిన గోడలను మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం కూల్చివేశారు. మాస్టర్‌ప్లాన్‌ అమలులో భాగంగా మూడునెలల క్రితం జిల్లాకలెక్టర్‌తోపాటు ఎస్పీఎం యాజమాన్యానికి మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసులను పంపించారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు తొలగించాలని సూచించినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా రోడ్డు వెడల్పు కోసం గోడలను తొలగించింది. మున్సిపల్‌ చైర్మన్‌ షాహిన్‌ సుల్తానా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగిర్‌, కౌన్సిలర్లు గోడల కూల్చివేతను పరిశీలించారు. అలాగే సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు కూడా సంఘటన స్థలానికి చేరుకొని మున్సిపల్‌ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

ఉద్రిక్తంగా మారిన పరిస్థితి..

ఎస్పీఎం గోడల కూల్చివేస్తున్న సమయంలో ఎస్పీఎం వైస్‌ప్రెసిడెంట్‌ ఏకే మిశ్రా సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని పనులను నిలిపివేయాలన్నారు. కొంతమంది ఎస్పీఎం కార్మి కులు మున్సిపల్‌ సిబ్బందితో వాదనకు దిగారు. పరిస్థితి చేజారుతుండటంతో ఎస్పీ ఎం ప్రతినిధులు కార్మికులకు నచ్చజెప్పారు. అనంతరం పనులు యధావిఽధిగా కొనసాగటంతో రహదారికి లైన్‌క్లియర్‌ అయి సమస్య సద్దుమణిగింది.

Updated Date - Mar 18 , 2024 | 10:18 PM